వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేంద్రసాయుద బలగాలతో భారీ కవాతు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం లోని లింగంపల్లి, బొల్లారం, హన్మాజిపేట్, మల్లారం, మర్రిపల్లి, నాగయ్య పల్లి పోలింగ్ కేంద్రాలు గల గ్రామాలలో ప్రధాన రహదారుల గుండా కేంద్రసాయుద బలగాల తో వేములవాడ రూరల్ ఎస్ ఐ మారుతీ ఆధ్వర్యంలో కవాతు నిర్వహించడం జరిగింది.

ప్రజలు స్వేచ్చాయుత వాతావరణం లో తమ ఓటు హక్కు ని వినియోగించుకోవాలని, ప్రతీ ఒక్కరు శాంతి యుత వాతావరణం లో ఎన్నికలు జరగటానికి సహకరించాలి అని శాంతి భద్రతల కు విఘాతం కలిగిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవు అని ఎస్ ఐ తెలిపారు.

ఈ కవాతు కార్యక్రమంలో వేములవాడ రూరల్ ఎస్ఐ మారుతి, ఏ ఎస్ ఐ లక్ పతి, పోలీస్ సిబ్బంది, కేంద్ర సాయుధ బలగాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 23 ఫిర్యాదులు స్వీకరణ. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

Latest Rajanna Sircilla News