రోజూ ముంబై ట్రైన్ ఎక్కుతున్న కుక్క.. దీని కథ తెలిస్తే అవాక్కవుతారు..

సాధారణంగా వీధి కుక్కలు నిరాధారణకు గురవుతుంటాయి.వీటికి ఎవరూ ఫుడ్ పెట్టరు.

ఇంట్లో కాసింత చోటు కూడా అందించరు.

దాంతో అవి ఆకలితో అలమటిస్తూ ఎండకి, చలికి, వానకి తట్టుకుంటూ ప్రత్యక్ష నరకం అనుభవిస్తాయి.

దీనికి తోడు కొంతమంది వాటికి రాళ్లు వేస్తూ ఇబ్బంది పెడుతూ క్రూరంగా ప్రవర్తిస్తుంటారు.వీటన్నింటి వల్ల వీధి కుక్కలు( Stray dogs ) ఎంతో క్షోభ అనుభవిస్తాయి.

కాగా కొన్ని వీధి కుక్కలు మనుషులతో కలిసిపోతూ అందరి ప్రేమానురాగాలను పొందుతుంటాయి ఒక కుక్క అయితే ఏకంగా ట్రైన్‌ ఎక్కి ప్రయాణికులతో పరిచయం పెంచుకుంటూ తన లైఫ్‌ను బ్యూటిఫుల్‌గా మార్చుకుంది.

Advertisement

వివరాల్లోకి వెళితే.ముంబైలో( Mumbai ) ఒక వీధికుక్క లోకల్ ట్రైన్స్ లో నిత్యం ప్రయాణిస్తూ ఇంటర్నెట్‌లో సంచలనంగా మారింది.బోరివాలి నుంచి అంధేరీ స్టేషన్‌లకు( Andheri stations ) వెళ్లే రైలులో ఈ కుక్క కాన్ఫిడెంట్‌గా ఎక్కి ప్రయాణం చేస్తోంది.

ఇది వీక్షకుల హృదయాలను దోచేస్తోంది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారింది.

మొదట్లో గందరగోళానికి గురైన తోటి ప్రయాణికులు వెంటనే రైలు తలుపు దగ్గర హాయిగా కూర్చున్న లేదా పడుకున్న కుక్కను కౌగిలించుకున్నారు.ఈ వీడియో మిలియన్ల కొద్దీ వ్యూస్‌ పొందింది.

కుక్క క్యూట్‌నెస్ పట్ల ప్రశంసలను వ్యక్తం చేస్తూ అనేక మంది కామెంట్లు చేశారు.

వీడియో: పాకిస్థాన్‌లో ప్రాంక్ చేసిన యువకులు.. లాస్ట్‌కి దిమ్మతిరిగే ట్విస్ట్..?
దేవుడా.. అది కడుపా లేక రాళ్ల గనా.. కడుపులో ఏకంగా 6110 రాళ్లు..

నెటిజన్లు కుక్కను కలవాలనే తమ కోరికను పంచుకున్నారు.మరికొందరు ముంబై మెట్రోలో ఆ కుక్కని చూసిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.ఇకపోతే కుక్కలు వివాహంలో ప్రయాణించడం కోసం కాదు.

Advertisement

కాకపోతే పబ్లిక్ రవాణా వాహనాలలో ఇవి ప్రయాణించడం చాలా తక్కువ.

తాజా వార్తలు