మూసివేసిన పాఠశాలను తిరిగి తెరిపించగలరు!

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) పదో వార్డ్ మున్సిపాలిటీ పరిధిలోని ముష్టిపల్లి గ్రామంలో గల ప్రాథమిక పాఠశాల గత రెండున్నర సంవత్సరాల నుంచి మూసి వేయబడి ఉందని, ఇందులో పనిచేసే ఇద్దరు ఉపాధ్యాయులను దగ్గరలో గల రాజీవ్ నగర్ పాఠశాల( Rajiv Nagar School )కి డిప్యూటేషన్ చేయడం జరిగింది.

దీనివల్ల పిల్లల భారత రాజ్యాంగంలో తెలుపబడిన ఆర్టికల్ 21 A ఉల్లంఘనకు గురికాబడింది.

ఈ ఆర్టికల్ ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాలలోపు బాల బాలికలలో బాల బాలికలకు కచ్చితంగా ఉచిత నిర్బంధ విద్యను అందించాల్సిన విది ప్రభుత్వానికి ఉంటుందని అన్నారు.ఈ రెండు సంవత్సరాల నుండి ముష్టిపల్లి గ్రామం( Mustipalle )లోని ఆరు నుంచి 14 సంవత్సరాల లోపు గల బాల బాలికలు పాఠశాలకు వెళ్ళ లేక పోతున్నారు.

ఈ పాఠశాల మూసివేత వల్ల వేల రూపాయలు కట్టలేక ప్రైవేట్ స్కూల్స్ కి పంపించలేక తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు.కచ్చితంగా ఈ పాఠశాలను తెరిపించి ఆ ఇద్దరి ఉపాధ్యాయుల డిప్యూటేషన్ రద్దుచేసి మళ్లీ ఇక్కడికి వచ్చేలా చేయాలని పాఠశాలను తెరిచి పిల్లలకు ఉచిత విద్య అందించాల్సిందనని స్థానిక కౌన్సిలర్ బొల్గాం నాగరాజ్ గౌడ్, జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారి లకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో స్థానిక పదో వార్డు కౌన్సిలర్ , తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీ పాల్గొనడం జరిగింది.

Advertisement
రహదారిపై వాహనదారుల ఇబ్బందులు

Latest Rajanna Sircilla News