రోడ్డు పక్కన ఉన్న వ్యక్తిని ఢీ కొట్టిన కారు.. షాకింగ్ వీడియో వైరల్..

ఈరోజుల్లో రోడ్డెక్కితే చాలు ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోతుంది.

బండ్ల మీద చాలా చిన్నగా పక్కన సైడ్ వెళ్తున్నా సరే కొంతమంది వాహనదారులు యమకింకరులుగా వచ్చి ఢీకొంటున్నారు.

వీటివల్ల చాలామంది ప్రాణాలు పోతున్నాయి.తాజాగా ఇలాంటి ఒక షాకింగ్ ఘటన మహారాష్ట్ర( Maharashtra )లోని మల్కాపూర్‌లోని కుద్రా బుద్రుక్ హైవేపై చోటు చేసుకుంది.

ఈ రహదారికి పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఒక వృద్ధుడిని సోమవారం మధ్యాహ్నం వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది.ఈ ఘటనలో ఆ వృద్ధుడు మృతి చెందాడు.

ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ దృశ్యాలు వీడియోలో రికార్డ్ అయ్యాయి.ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

Advertisement

ఇందులో మెరూన్ కారు కొంచెం దారి తప్పించి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధుడిని ఢీకొట్టింది.ఢీకొనడం వల్ల వృద్ధుడు గాల్లో ఎగిరి కింద పడ్డాడు.

వీడియోలో కారు ఢీకొట్టిన వెంటనే మళ్లీ హైవేపైకి వచ్చి వేగంగా వెళ్లిపోయిందని నిలుస్తోంది.

మృతుడిని నామ్‌దేవ్ తుకారాం కావ్డేగా గుర్తించారు.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఢీకొనడం వెనకాల పరిస్థితులు చూస్తుంటే ఇది సాధారణ హిట్ అండ్ రన్ కాదేమో అని అనుమానిస్తున్నారు.

కావాలనే రోడ్డు పైనుంచి కిందకి దింపి అతడిని డ్రైవర్ ఢీకొట్టాడు ఏమో అని కొందరు అనుమానిస్తున్నారు.మరి ఇది మర్డర్ హా లేదంటే రోడ్డు ప్రమాదమా అనేది తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
జీవితం మహా చెడ్డది భయ్యా.. భార్య వల్ల చెత్త ఏరుకునే స్థాయికి ఇంజనీర్‌..?

మహారాష్ట్రలోని థానే జిల్లా( Thane )లో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది.సోమవారం సాయంత్రం 7 గంటల సమయానికి 100 అడుగుల రోడ్డుపై 26 సంవత్సరాల వ్యక్తిని హత్య చేశారు.పోలీసుల ప్రకారం, హత్యకు గల కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

Advertisement

కానీ, లోకల్స్ చెప్పిన వివరాల ప్రకారం, ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు బాధితుడి దగ్గరకు వచ్చి కాసేపు మాట్లాడి, అనంతరం కత్తితో పొడిచి పారిపోయారు.సంఘటన స్థలానికి వెంటనే చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు.

బాధితుడితో పాటు ఉన్న వ్యక్తి ఫిర్యాదు మేరకు, కొల్‌సేవాడి పోలీసులు నిందితుల గుర్తింపు తెలియని కేసు నమోదు చేశారు.ఐపీసీ 103వ సెక్షన్ (హత్య) కింద కేసు నమోదైంది.

నిందితులను పట్టుకోవడానికి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.

తాజా వార్తలు