7 ఏళ్ల బాలుడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ నెలకొల్పాడు... సాధించిన ఘనత ఇదే!

రికార్డులు నెలకొల్పడానికి వయస్సుతో పని ఏముంది? సాధించాలనే తపన ఉండాలేగాని ఎటువంటివారైనా వున్నత శిఖరాలు అధిరోగించగలరు.

నేటి కంప్యూటర్ యుగంలో చిన్న పిల్లలు చిరుతల్లాగా దూసుకు పోతున్నారు.

వారి అభిరుచులను గుర్తించి ప్రోత్సాహం ఇస్తే చాలు.చిచ్చర పిడుగుల్లాగా అనుకున్నది సాధించి చూపెడుతున్నారు.

ఈ విషయాలను ఓ 7 ఏళ్ల బాలుడు నిజం చేసి చూపించాడు.

బేస్‌బాల్ నిబంధనలపై గట్టి పట్టు ఉన్న 7 సంవత్సరాల వయస్సుగల లూసియానా బాలుడు లాథన్ విలియమ్స్ ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో తన పేరుని లిఖించేందుకు నిమగ్నమయ్యాడు.లాథన్ విలియమ్స్, అతని తల్లిదండ్రులు నిర్వహించే సోషల్ మీడియా ఛానెల్‌లలో లాథన్ ది కిడ్ అంపైర్ అని పిలవబడే షోలోనూ అంపైరింగ్ టిప్స్ ఇస్తూ ఉంటాడు.లాథన్ విలియమ్స్ 5 సంవత్సరాల వయస్సు నుంచి స్థానిక బేస్ బాల్ గేమ్‌లకు అంపైర్‌గా పని చేయడం విశేషం.12 ఏళ్ల వయస్సులో ఉన్న ఆటగాళ్లు ఆడే టోర్నీలలో కూడా మనోడు అపైరింగ్‌ దుమ్ముదులిపేస్తాడు.

Advertisement

ఆ టాలెంటే మనోడిని ఈ ప్రపంచంలో చాలా ప్రత్యేకంగా నిలిపింది.స్థానిక లిటిల్ లీగ్ జట్టు తరపున కూడా ఆడే లాథన్.గొంజాలెస్‌లోని స్టీవెన్స్ పార్క్‌లో బుధవారం నాడు అనగా మార్చి 8న డబుల్-హెడర్‌కు అంపైరింగ్ చేయవలసి ఉంది.

ఏపీ బేస్ బాల్ ద్వారా స్పాన్సర్ చేయబడిన ఈ ఈవెంట్‌లో ప్రపంచంలోని అతి పిన్న వయస్కుడైన బేస్ బాల్ అంపైర్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకునేందుకు అధికారిక ప్రయత్నంగా ఉపయోగపడుతుందని లాథన్ విలియమ్స్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.నిజంగా అద్భుతం కదూ.మీ ఇంట్లో కూడా ఓ చిన్నారి టాలెంట్ వుండే ఉంటాడు.కాబట్టి బాగా ప్రోత్సహించి వారి ఉన్నతికి తోడ్పడండి.

Advertisement

తాజా వార్తలు