రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే చల్లని కబురు చెప్పింది.ఇకనుండి ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుకింగ్ అనేది మరింత సులభతరం కానుంది.
ఇండియన్ రైల్వేస్‌కు చెందిన ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ తాజాగా ఈ కొత్త సేవలు అందుబాటులోకి తెచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.ఐఆర్‌సీటీసీ తాజాగా ఈజీబజ్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్న సంగతి అందరికీ తెలిసినదే.
ఐఆర్‌సీటీసీ, ఈజీబజ్ పేమెంట్స్ భాగస్వామ్యం వల్ల ఇప్పుడు ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలని భావించే వారికి మరో పేమెంట్ ఆప్షన్ అందుబాటులో ఉండనుంది.

డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, వాలెట్స్ ఇలా ఏ మార్గంలో అయినా ఈజీబజ్ ప్లాట్‌ఫామ్ ద్వారా రైల్వే టికెట్లను బుక్ చేసుకోవచ్చు.ఈ నేపథ్యంలో ఐఆర్‌సీటీసీతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని ఈజీ బజ్ గ్రూప్ హెడ్ సేల్స్ రోహిత్ కత్యాల్ అన్నారు.ఇంకా ఆయన మాట్లాడుతూ… ఎక్కువ పరిమాణంలోని లావాదేవీలను సైతం ఈజీగానే నిర్వహించేలా తన వ్యవస్థను టెక్నాలజీతో తయారు చేశామని వివరించారు.టికెట్ బుకింగ్ మరింత సులభంగా అవుతుందని పేర్కొన్నారు.

ఇకపోతే ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలని అనుకునేవారు ముందుగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాలి.తర్వాత ట్రైన్ సెర్చ్ చేసిన తరువాత పర్టిక్యులర్ ట్రైన్ ఎంపిక చేసుకోవాలి.ఆ తర్వాత ప్యాసింజర్ వివరాలు ఎంటర్ చేసి పేమెంట్ చేయాల్సి ఉంటుంది.
ఇక్కడ పేమెంట్ గేట్‌వే పేజీ ఉంటుంది.ఇందులో చాలా పేమెంట్ ఆప్షన్లు కనిపిస్తాయి.
వీటిల్లో ఈజీ బజ్ అనే ఆప్షన్ ఎంచుకుంటే 2 ఆప్షన్లు కనిపిస్తాయి.క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులు రెండింటిలో ఒకదానిని ఎంచుకోవాలి.
అదేకాకుండా పేటీఎం , ఐఆర్‌సీటీసీ ఐపే, పేయూ, రాజోర్‌పే, ఫోన్‌పే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎయిర్‌పే, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, ఇండస్ఇండ్ బ్యాంక్ వంటి పమెంట్ గేట్‌వే కూడా ఉన్నాయి.ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే వారు ఎలా అయినా టికెట్ బుక చేసుకోవచ్చు.