టాలీవుడ్ ప్రేక్షకులు ‘రుద్రమదేవి’ చిత్రం కోసం ఎంత ఆతృతతో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్తి అయ్యింది.
ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.ఈ సినిమాను విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చకచక జరుగుతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఎప్పుడు విడుదల చేసే విషయంలో చిత్ర యూనిట్ ఒక క్లారిటీకి వచ్చినట్లుగా తెలుస్తోంది.
ఈ చిత్రం ఆడియోను వచ్చే నెల 17న విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఇండస్ట్రీలోని ప్రముఖులు ఈ సినిమా ఆడియో వేడుకలో హాజరు కాబోతున్నారు.ఇక ఈ సినిమాను క్రికెట్ ప్రపంచకప్ పూర్తి అయిన తర్వాత అంటే మార్చి 27న విడుదల చేయబోతున్నారు.
ఆ సమయంలో మరే సినిమాలు ఉన్నా కూడా విడుదల ఆపేది లేదని ఇప్పటికే దర్శకుడు గుణశేఖర్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘సన్నాఫ్ సత్యమూర్తి’ మరియు బాలయ్య ‘లయన్’ సినిమాలు కూడా అదే సమయంలో విడుదలకు సిద్దం అవుతున్నాయి.
మరి ఈ రెండు సినిమాలు ‘రుద్రమదేవి’కి అడ్డు నిలుస్తాయో చూడాలి.