బంపర్‌ ఆఫర్‌ కొట్టేసిన సంపూ

బర్నింగ్‌ స్టార్‌ సంపూర్నేష్‌బాబు క్రేజ్‌ రోజు రోజుకు పెరుగుతూ పోతుంది.ప్రస్తుతం తెలుగులో స్టార్‌గా వెలుగు వెలుగుతున్న సంపూర్నేష్‌బాబు త్వరలో తమిళంలో ఒక చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్నాడు.

 Sampoornesh Babu In Vikram’s Next Film-TeluguStop.com

అది కూడా ఒక చిన్న సినిమా కాదు.ఏకంగా ‘ఐ’ స్టార్‌ విక్రమ్‌ తాజా చిత్రం.

ఇటీవలే ‘ఐ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్రమ్‌ ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు విజయ్‌ మిల్టన్‌ దర్శకత్వంలో ‘10 ఎన్రాకుల’ సినిమాలో నటిస్తున్నాడు.ఆ సినిమాలో హీరోయిన్‌గా సమంత నటిస్తోంది.

ఒకే సారి తెలుగు మరియు తమిళంలో ఈ సినిమా నిర్మాణం జరుగుతోంది.తమిళ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాలో నటించే అవకాశాన్ని సంపూ దక్కించుకున్నాడు.ఇటీవల సంపూ గురించి తెలుసుకున్న విక్రం స్వయంగా దర్శకుడు విజయ్‌తో సంపూ కోసం ఒక పాత్ర ఈ సినిమాలో ఉండాలని చెప్పినట్లుగా తెలుస్తోంది.

తెలుగులో ప్రస్తుతం హీరోగా చేస్తూనే, స్టార్‌ హీరోల సినిమాల్లో కమెడియన్‌గా నటిస్తున్న సంపూర్నేష్‌బాబు తమిళంలో విక్రం సినిమా విడుదలైన తర్వాత అక్కడ కూడా మంచి క్రేజ్‌ను దక్కించుకునే అవకాశాలున్నాయని అంటున్నారు.ప్రస్తుతం ఈయన ‘కొబ్బరి మట్ట’ మరియు ‘సింగం 123’ చిత్రాల్లో నటిస్తున్నాడు.

ఆ చిత్రాలే కాకుండా ఈయన కమెడియన్‌గా నటించిన ‘బందిపోటు’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube