సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార.తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు ప్రస్తుతం తమిళంలో వరుస చిత్రాలు చేస్తూ యమ బిజీగా ఉంది.
తెలుగులో ప్రస్తుతం ఒక్క చిత్రం కూడా ఈమె చేయడం లేదు.అయితే తాజాగా నయన తార హఠాత్తుగా హైదరాబాద్‌లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది.
అది కూడా ఒక బర్త్‌డే పార్టీ కోసం చెన్నై నుండి ఈ అమ్మడు పనిగట్టుకు వచ్చిందని టాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
ఆ బర్త్‌డే మరెవ్వరిదో కాదు మాస్ మహారాజా రవితేజది.
ఇటీవలే రవితేజ తన బర్త్‌డే సందర్బంగా ఒక భారీ పార్టీని ఏర్పాటు చేశాడు.ఆ పార్టీలో సినీ పరిశ్రమకు చెందిన ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు.
ఈయనతో కలిసి పని చేసిన దర్శకులు, నిర్మాతలు, హీరోయిన్‌లు కూడా ఈ కార్యక్రమంలో హాజరు అయినట్లుగా తెలుస్తోంది.అదే క్రమంలో నయనతారను కూడా రవితేజ ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది.
వీరిద్దరు కలిసి నటించారు.దాంతో వీరిద్దరికి మంచి స్నేహ సంబంధం ఉంది.
ఆ స్నేహ భావంతోనే నయనత తాజాగా ఈ పార్టీకి వచ్చిందని సినీ ప్రముఖులు కొందరు అంటున్నారు.ఇటీవలే బాలకృష్ణ సినిమాలో నయన తారను హీరోయిన్‌గా పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.
మరి ఈమె తెలుగులో మళ్లీ ఎప్పుడు సినిమా చేస్తుందా అని ఆసక్తిగా ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు.







