"పండగ" పూట ప్రభుత్వానికి "చెక్"

రాష్ట్ర విభజన తరువాత సీమాంధ్ర రాజధానిగా తుళ్ళూరు ను ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే.

అయితే ప్రకటించినంత సులభంగా రాజధాని నిర్మాణం మొదలవుతుంది అనుకోవడం ఒకింత హాస్యాస్పదమే అవుతుంది.

ఇంతవరకు ఎలా ఉన్నా.రాజధాని నిర్మాణం చేపట్టాల్సిన ప్రాంతంలో అనేక ఇబ్బందుల నడుమ ప్రభుత్వం కొట్టి మిట్టాడుతూ కొనఊపిరితో కొట్టుకుంటుంది.

ఇక ఇదే క్రమంలో అధిక శాతం రైతులు రాజధాని నిర్మాణం కోసం తమ భూములు ఇస్తాం అంటూ ప్రకటించగా, మరికొందరు తాము ఇవ్వబోము అంటూ వ్యతిరేకించారు.ఇక తెలుగు పండుగను పురస్కరించుకుంది తమ నిరసనను వినూత్న రూపంలో తెలియజేశారు.

పెనుమాక ప్రాంతం రైతులు గ్రామంలోని రామాలయం సెంటర్లో బుధవారం రాజధాని నిర్మాణానికి తమ భూములు ఇవ్వబోమని నిరసన వ్యక్తం చేస్తూ ముగ్గుల రూపంలో ప్రభుత్వానికి తమ వాణిని వినిపించారు.ఇళ్లలోనూ ముగ్గులేసి భూములిచ్చే ప్రసక్తే లేదని విన్నవించారు.

Advertisement

చంద్రబాబు తమ గ్రామం మీద కక్షతో వ్యవహరిస్తున్నారని, భూములు ఇవ్వబోమన్న తమపై బల ప్రయోగం చేయడానికి సిద్ధమవుతున్నారని పలువురు రైతులు చెబుతున్నారు.మరి ఇదంతా రైతులే చేస్తున్నారా, లేక వెనుక నుండి ఏమైనా శక్తులు నడిపిస్తున్నాయా అన్న అనుమానం సైతం కనిపిస్తుంది.

చూడాలి మరి ఏం జరగబోతుందో.

Advertisement

తాజా వార్తలు