లక్షలు ఖర్చు పెట్టినా వెంటిలేటర్ పైనే.. సాయం చేయాలని కోరుకుంటున్న అరుంధతి సోదరి!

కోలీవుడ్‌ హీరోయిన్‌ అరుంధతి నాయర్‌( Arundhati Nair ) రోడ్డు ప్రమాదానికి గురై గాయాలతో ఐసీయూలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.మార్చి 14న ఒక ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన సోదరుడితో కలిసి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఒక కారు వేగంగా వచ్చి వారి స్కూటీని ఢీ కొట్టింది.

 Actress Arundhathi Nair Still Ventilator, Arundhathi Nair, Ventilator, Tollywood-TeluguStop.com

దాంతో ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.అయితే గత కొద్ది రోజులుగా అరుంధతి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.

ఆమె ఆరోగ్యం విషమంగా ఉంది.ఎవరైనా సాయం చేస్తే కానీ బతకదని తన సోదరి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఇప్పటికే పలుమార్లు వేడుకున్నారు.

Telugu Arundhathi Nair, Tollywood-Movie

అందుకోసం బ్యాంకు వివరాలను ( Bank details )సైతం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇవ్వడం జరిగింది.ప్రస్తుతం త్రివేండ్రంలోని అనంతపూరి ఆస్పత్రిలో( Ananthapuri Hospital, Trivandrum )అరుంధతికి చికిత్స జరుగుతోందనీ ఆమె సోదరి ఆర్తీ చెప్పింది.ఇప్పుడు వెంటిలేటర్ సాయంతో అరుంధతి శ్వాస తీసుకుంటున్నట్లు తెలిపింది.వైద్యం కోసం రోజూ దాదాపు రూ.2 లక్షలు ఖర్చు అవుతోందని, ఇప్పటికే అరుంధతి కోసం రూ.40 లక్షలు ఆస్పత్రి బిల్లులు చెల్లించామని అర్తీ తెలిపింది.అరుంధతి తల, వెన్నెముకకు తీవ్ర గాయాలు కావడమే కాకుండా మెదడులో రక్తం గడ్డకట్టిందనీ అందుకు సంబంధించిన బ్రెయిన్‌ సర్జరీ ప్రస్తుతం పూర్తి అయినట్లు ఆమె తెలిపింది.

Telugu Arundhathi Nair, Tollywood-Movie

ఇప్పుడు కూడా కదలలేని స్థితిలో వెంటిలేటర్‌ మీదే అరుంధతి చికిత్స పొందుతున్నట్లు ఆర్తీ ( Arti )ఆవేధన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘ పోస్ట్ చేసింది.90 రోజులు దాటినా తర్వాత కూడా ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందనే విషయం క్లారిటీగా చెప్పలేమని వైద్యులు అన్నట్లు ఆర్తీ పేర్కొంది.ప్రస్తుతం అరుంధతికి పక్కటెముకలకి సంబంధించిన శస్త్రచికిత్స చేయవలసి ఉంటుంది కాబట్టి తమకు సాయం చేయాలని ఆమె కోరింది.

ఇప్పటికే పలువురు మళయాల నటీమణులు కూడా ఆమెకు సాయం చేయాలని పలు వీడియోల ద్వారా అభ్యర్థిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube