గడిచిన 9 సంవత్సరాలలో గంభీరావుపేట మండల అభివృద్ధి ఏది

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హమీద్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గడిచిన తొమ్మిది సంవత్సరాలలో మంత్రి కేటీఆర్, మండల నాయకులు మండలాన్ని ఏం అభివృద్ధి చేశారో బహిరంగ చర్చకు రావాలన్నారు.

 Congress Leaders Questions On Gambhiraopeta Mandal Development, Congress Leaders-TeluguStop.com

మండల కేంద్రంలోని 30 పడకల ఆసుపత్రి నిర్మాణనికి భూమిపూజ చేసి పనులు ఎందుకు మొదలు పెట్టలేద న్నారు.మల్లుపల్లి బ్రిడ్జి ఏమైంది,వర్షాలు రావడం వల్ల రోడ్డు కొట్టుకుపోయి రైతుల పంట పొలాలలో ఇసుక బీటలు పెడుతున్నాయని, కేజీ టు పీజీ ప్రాంగణంలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ వసతి లేక దూరప్రాంత విద్యార్థులు అవస్థ పడుతున్నారన్నారు.

గంభీరావుపేట మండలంలో మినీ ట్యాంక్ బండ్ కట్టిస్తామన్న మాట ఏమైందని, మండలం తర్వాత ఎక్కువ జనవాసం కలిగి ఉన్న కొత్తపల్లి కి గుంతలతో కూడిన రోడ్డు ను డబుల్ రోడ్డు వేస్తానని ఈరోజు వరకు వేయలేదని ఆరోపించారు.పెద్దమ్మ స్టేజి నుండి లింగన్నపేట వరకు డబుల్ రోడ్డు మంజూరు చేయించింది కాంగ్రెస్ పార్టీ కాదా అని గుర్తు చేశారు.

శ్రీగాధ బ్రిడ్జి మా కాంగ్రెస్ హయాంలోనే మంజూరు చేశామని, మా కాంగ్రెస్ పార్టీ హయాంలో మంజూరైన పనులకు కూడా మీరు మేమే చేశామని సంకలు గుద్దుకోవడం ఎంతవరకు సమంజసమని అన్నారు.

మండలంలో ఇంతవరకు ఒక్క డబల్ బెడ్ రూమ్ కూడా ఇవ్వడం లేదని, ఎగువ మానేరును పర్యాటక కేంద్రం చేస్తానన్న మాట ఎటు పోయిందన్నారు.

తొమ్మిదవ ప్యాకేజీ ద్వారా ఎగువ మానేరు నింపుతామన్న మంత్రి ఎందుకు పనులకు ఆలస్యమైతుందో చెప్పాలని, ఇలా చెప్పుకుంటూ పోతే మండలంలో బిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసింది శూన్యమని హమిద్ ఎద్దేవా చేసారు.ఈ కార్యక్రమంలో, పాపగారి రాజు,సీనియర్ నాయకులు, రాజ బోయిన లచ్చయ్య, ఓరగంటి నర్సింలు, ఎడాపోయిన ప్రభాకర్, జంగం రాజు, ఇమ్రాన్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube