పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ”బ్రో”.మెగా మల్టీ స్టారర్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఇప్పటికే వచ్చిన పోస్టర్స్ బాగా ఆకట్టు కున్నాయి.ఇక ఇప్పుడు ఫ్యాన్స్ అంతా టీజర్ కోసం ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలోనే టీజర్ పై మేకర్స్ అఫిషియల్ గా అప్డేట్ ఇచ్చారు.
బ్రో టీజర్ ను 29న విడుదల చేయాలని ప్లాన్ చేసారు.
కానీ ఇంకా పవన్ కళ్యాణ్ డబ్బింగ్ బ్యాలెన్స్ ఉన్నట్టు తెలుస్తుంది.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మంగళగిరి పరిసర ప్రాంతాల్లో వారాహి యాత్ర( Varahi Yatra ) చేస్తున్న విషయం తెలిసిందే.
మరి ఈయన రాజకీయాల వల్ల పవన్ కళ్యాణ్ టీజర్ లో చెప్పాల్సిన డైలాగ్స్ పెండింగ్ లో ఉన్నాయట.దీంతో టీమ్ అంతా కలిసి ఛలో పవన్ అంటూ ఆయన వద్దకు చేరుకున్నట్టు తెలుస్తుంది.
ఆయన ఉన్న బిజీ షెడ్యూల్ లో ఉన్న కారణంగా హైదరాబాద్ వచ్చి డబ్బింగ్ చెప్పలేక పోతున్నాడు.దీంతో డైరెక్టర్ సముద్రఖని మొబైల్ డబ్బింగ్ యూనిట్ ను తీసుకుని చలో మంగళగిరి అంటూ పయనం అయ్యారని తెలుస్తుంది.మరి టీజర్ లో బ్యాలెన్స్ పూర్తి చేస్తేనే టీజర్ రిలీజ్ చేయడానికి ఉంటుంది.చూడాలి పవన్ పూర్తి చేసి అనుకున్న సమయానికి రిలీజ్ అయ్యేలా చేస్తారో లేదో.
ఇక ఇదిలా ఉండగా బ్రో సినిమాలో పవన్ పాత్ర తక్కువే అయిన ఆయన ఉండడంతో ఈ సినిమాపై పవన్ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఉన్నారు.ఇక ప్రియా ప్రకాష్ వారియర్( Priya Prakash Varrier ), కేతిక శర్మ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను జీ స్టూడియోస్ తో కలిపి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా జులై 28న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.