ప్రస్తుత సమాజం ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదు.గత కొన్ని రోజులుగా పట్టపగలు నడిరోడ్డుపై దారుణాలు జరగడం క్రమంగా పెరుగుతున్నాయి.
గతంలో రాత్రి సమయాలలో, నిర్మానుష్య ప్రాంతాలలో దారుణాలు జరిగేవి.ప్రస్తుతం పట్టపగలు జనాలు రద్దీగా ఉండే ప్రాంతాలలో కూడా దారుణాలు జరగడం ప్రారంభమయ్యాయి.
ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా.ప్రయోజనం మాత్రం శూన్యంగానే అనిపిస్తుంది అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.
ఒక వ్యక్తి కొడవలి( Knife ) తీసుకుని అందరూ చూస్తుండగానే యువతిపై దాడికి ప్రయత్నించాడు.అయితే మానవత్వం ఉన్న కొందరు ఆ దాడిని ఆపే ప్రయత్నం చేయగా వారిపై కూడా దాడికి ప్రయత్నించాడు.
ఈ దాడి వల్ల ఆ ప్రాంతమంతా భయభ్రాంతులకు గురైంది.ఈ సంఘటన పూణేలోని( Pune ) సదాశివపేట లో చోటుచేసుకుంది.ఈ ఘటన అంతా పక్కనే ఉన్న సీసీటీవీ కెమెరాలు రికార్డ్ అయింది.అసలు ఏం జరిగిందో అనే వివరాలు చూద్దాం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.సదాశివ పేటలో ఉండే ప్రీతి రామచంద్ర(20) ( Preeti Ramachandra ) అనే అమ్మాయిని అదే ప్రాంతానికి చెందిన శంతను లక్ష్మణ్ జాదవ్ అనే వ్యక్తి కొద్ది రోజులుగా కొద్ది రోజులుగా ప్రేమ పేరుతో వెంటపడుతూ వేధిస్తున్నాడు.ఈ విషయాన్ని లక్ష్మణ్ జాదవ్ తండ్రి దృష్టికి తీసుకువెళ్లిన కూడా లక్ష్మణ్ జాదవ్ లో ఎటువంటి మార్పు రాకపోగా ప్రీతిని చంపడానికి ప్రయత్నిస్తున్నాడని ఆమె తల్లి తెలిపింది.

తాజాగా లక్ష్మణ్ జాదవ్, ప్రీతి వెళ్లే దారిలో కాపు కాసి ఆమె కనిపించిన వెంటనే ఒక చేత్తో కొడవలి పట్టుకుని వెంబడిస్తూ దాడికి ప్రయత్నించగా ఆమె కింద పడింది.వెంటనే కొడవలితో ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించే క్రమంలో పక్కనే ఉండే స్థానికులు ప్రీతిని రక్షించారు.తరువాత లక్ష్మణ్ జాదవ్, స్థానికులపై కొడవలితో దాడికి ప్రయత్నించాడు.
అప్పుడు స్థానికులు పక్కనే ఉండే వస్తువులు విసిరి లక్ష్మణ్ జాదవ్ ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు.ప్రీతి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు లక్ష్మణ్ జాదవ్ పై హత్యయత్నం కేసు ఐపిసి సెక్షన్ 307 ప్రకారం అరెస్టు చేశారు.







