తెలుగు సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు.నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ సాధించినటువంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్నారు.
నటుడిగా పవన్ కళ్యాణ్ కు ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఎంతోమంది సినీ సెలబ్రిటీలు కూడా అభిమానులుగా ఉన్న విషయం మనకు తెలిసిందే.ఇక ఎంతోమంది హీరోయిన్స్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే ఛాన్స్ వస్తే చాలని ఎదురుచూస్తున్నారు.

ఇలా ఎంతోమంది సెలెబ్రిటీలు పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే అవకాశం కోసం ఎదురు చూడటమే కాకుండా ఆయన అంటే ఇష్టపడే హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు.అయితే పవన్ కళ్యాణ్ నుఇష్టపడే హీరోయిన్స్ మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ కి కూడా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ అంటే చాలా ఇష్టం అని తెలుస్తుంది.గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో తన ఫేవరెట్ హీరోయిన్( Favourite Heroin ) గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ కు ఇండస్ట్రీలో ఇష్టమైన హీరోయిన్ ఎవరు అనే విషయానికి వస్తే తాను మరెవరో కాదు సీనియర్ నటి మహానటి సావిత్రి ( Savitri )అంటే తనకు ఎంతో ఇష్టమని పవన్ కళ్యాణ్ కి వెల్లడించారు.ఆమె ఒక నటిగా కంటే మంచి మనసున్న వ్యక్తిగా తనకు మరింత ఇష్టమని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.నటన విషయానికి వస్తే ఆమె ఒక గొప్ప నటి అని, ఆమె సినిమాలన్నా, నటన అన్నా నాకు చాలా ఇష్టం అని చెప్పాడు.
ఇలా పవన్ కళ్యాణ్ తన ఫేవరెట్ హీరోయిన్ సావిత్రి అనే విషయం తెలియడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.







