బుల్లితెర కామెడీ షోల ద్వారా, యూట్యూబ్ వీడియోల ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న వాళ్లలో యాదమ్మ రాజు( Yadamma Raju ) ఒకరు.యాదమ్మ రాజు కామెడీ టైమింగ్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.
అయితే పెళ్లై ఏడాది కాకపోయినా ఈ కమెడియన్ మాత్రం విడాకులు( Yadamma Raju Divorce ) తీసుకోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.అయితే తాజాగా ఈ జంట చేసిన తుంటరి పనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే ఒక డ్యాన్స్ షోలో పాల్గొన్న ఈ జోడీ తాము విడాకులు తీసుకుంటున్నామని వెల్లడించడం గమనార్హం.యాదమ్మ రాజు స్టెల్లా( Stella ) ఒకరితో ఒకరు మాట్లాడుతూ విడాకుల టాపిక్ తెచ్చారు.
నీతో నా వల్ల కావడం లేదు నాకు డివోర్స్ కావాలి అని స్టెల్లా అడగటంతో పాటు ఆ విడాకుల వేడుక పండుగలా జరగాలని యాదమ్మ రాజు, స్టెల్లా చెప్పుకొచ్చారు.షో ప్రమోషన్స్ కోసమే వీళ్లిద్దరూ ఈ విధంగా చెప్పారు.
![Telugu Yadamma Raju, Sridevidrama, Stella, Yadammaraju-Movie Telugu Yadamma Raju, Sridevidrama, Stella, Yadammaraju-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/06/comedian-yadamma-raju-divorce-with-wife-stella-detailsa.jpg)
పెళ్లై ఏడాది కాకముందే విడాకులు అంటూ అశుభం పలుకుతూ ఈ జంట స్కిట్లు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఈ మధ్య కాలంలో ప్రతి టీవీ షోలో ప్రేక్షకులను చీటింగ్ చేయడం సాధారణం అయిపోయిందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.యాదమ్మరాజు లాంటి పాపులర్ కమెడియన్ ఈ విధంగా చేయడం కరెక్టేనా అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
![Telugu Yadamma Raju, Sridevidrama, Stella, Yadammaraju-Movie Telugu Yadamma Raju, Sridevidrama, Stella, Yadammaraju-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/06/comedian-yadamma-raju-divorce-with-wife-stella-detailsd.jpg)
యాదమ్మ రాజు రెమ్యునరేషన్ కూడా భారీ రేంజ్ లో ఉందని తెలుస్తోంది.యాదమ్మ రాజు కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు.యాదమ్మ రాజును అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం.
సినిమాలలో కూడా ఈ కమెడియన్ కు భారీ స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది.ఈ కమెడియన్ మరింత సక్సెస్ కావాలని అభిమానులు ఆశిస్తున్నారు.
యాదమ్మరాజు, స్టెల్లా ఇలాంటి స్కిట్లు చేయకుండా సంతోషంగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.