ఆంధ్రుల ఆశలపై కేసీఆర్ పోరాటం చేయనున్నారా?

అవుననే అంటున్నారు ఆంధ్రా బారాసా నేతలు.

విభజన హామీల లో అతి ముఖ్యమైన హామీ ఆంధ్ర ప్రదేశ్( Andhra Pradesh ) కు ప్రత్యేక హోదా .

అప్పటి ప్రధాని మన్మోహన్( Prime Minister Manmohan ) రాజ్య సభ లో స్పస్టం గా ప్రకటించినా కూడా పట్టించుకోకుండా అది ముగిసిపోయిన అధ్యాయం అంటూ ఆంధ్రులను మోసం చేసిన భాజపా ప్రభుత్వంపై పోరాటం చేయడంలో ఆంధ్ర నేతలు విఫలమయ్యారని ఇప్పుడు పోరాటం ఎలా ఉంటుందో కెసిఆర్ చూపిస్తారని భారసా నేతలు ప్రకటనలు చేస్తున్నారు ప్రత్యేక హోదాపై మాత్రమే కాదు పోలవరం ప్రాజెక్టు, మెట్రో,వైజాగ్ స్టీల్ ప్లాంట్ అలా రాష్ట్ర అభివృద్ధికి తల మాణికం లాంటి విషయాల్లో కూడా ఇకపై కేంద్రం పై ఒత్తిడి తీసుకొచ్చే వ్యూహం కేసీఆర్( KCR ) పన్నుతున్నారని తద్వారా ఆంధ్ర ప్రజలలో తన పట్ల ఉన్న వ్యతిరేకతను పోగొట్టుకొని అనుకూల పవనాలు వీచెలా చేసుకోవడం , కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం ఇలా ఒకే దెబ్బకు రెండుపిట్టల అని బారాశా నాయకత్వం ఆలోచనలు చేస్తుందట.

అసలు కేంద్రంపై పోరాటం చేయడంలో ఆంధ్ర పార్టీలకు చిత్తశుద్ధి లేదని తమ ఆశలు సరైన నాయకత్వం వహించే నాయకుడు లేరని ఆంధ్ర ప్రజలు అసంతృప్తితో ఉన్న వేల ఆశలకు వారధిగా పని చేయడం ద్వారా జాతీయ స్థాయి నాయకుడిగా తనను తన ఆవిష్కరించుకునే అద్భుతమైన అవకాశం కేసీఆర్ ముందు ఉంది గత తొమ్మిది సంవత్సరాలుగా కేంద్రం దారుణంగా ఆంధ్ర ప్రజలను మోసం చేస్తున్నా కూడా గొంతు ఎత్తు నిలబడే ఒక పార్టీ కూడా లేని పరిస్థితిని బారసా నాయకత్వం నిశితం గా గమనిస్తుంది .ప్రజల మనసులలో ఉన్న వాటిపై గట్టిగా నిలబడితే కచ్చితంగా ఆంధ్ర ప్రజల మద్దతు దొరుకుతుందని ఆ పార్టీ లెక్కలు వేసుకుంటుందట .కెసిఆర్ లాంటి డైనమిక్ లీడర్ లేకపోవడం వల్లే అతి ముఖ్యమైన ప్రత్యేక హోదా ఇంతవరకు రాలేదని పోరాటాలు ఎలా చేయాలో ఇకపై తమ నాయకుడు చూపిస్తాడు అంటూ భారసా నాయకులు చెప్తున్నారు.

ఏది ఏమైనా విభజన జరగడానికి ముఖ్యమైన కారణం కేసీఆర్ అని ఆంధ్ర ప్రజలలో ఒక వ్యతిరేకత అయితే ఉంది ఇప్పుడు విభజన హామీలు నెరవేర్చడానికి పోరాటం చేయడం ద్వారా ఆ వ్యతిరేకతను పోగొట్టుకొని తద్వారా రాజకీయ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే అద్భుతమైన అవకాశం కూడా ఇప్పుడు కేసీఆర్ ముంగిట ఉంది మరి అవకాశాలు అంది పుచ్చుకోవడంలో ఎప్పుడూ ఒక అడుగు ముందు ఉండే కేసీఆర్ ఈ అవకాశాన్ని ఏరకంగా ఉపయోగించుకుంటారో తద్వారా జాతీయ రాజకీయాలలో ఏ మేరకు చక్రం తిప్పగలుగుతారు చూడాలి.

Advertisement
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

తాజా వార్తలు