ఆ లవ్ స్టోరీని టచ్ చేయద్దు అని అంటున్న అభిమానులు

కొన్ని లవ్ స్టోరీస్ ఎప్పుడు చూసిన మల్లి మల్లి చూస్తూనే ఉంటాము .

ప్రేమ కథలను తెరెకెక్కించడంలో ఒక్కో దర్శకుడు స్టయిల్ ఒక్కోలా ఉంటుంది,ఒక ప్రేమకధా చిత్రంలో బాధాకరమైన ముగింపు ఉంటే ,అదే ఇంకో ప్రేమ కధ చిత్రంలో సంతోషం తో కూడుకున్న ముగింపు ఉంటుంది.

ప్రేమ కధలను స్క్రీన్ మీద ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తెరకెక్కించడం అంటే డైరెక్టర్స్ కు కత్తి మీద సాము లాంటిదే.ఇక అసలు విషయానికి వస్తే .2004లో తమిళ్ స్టార్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ - యంగ్ టాలెంటెడ్ హీరో రవికృష్ణ కాంబినేషన్ లో వచ్చిన రొమాంటిక్ డ్రామా మూవీ “7/g బృందావన్ కాలనీ”. ఈ సినిమా గురుంచి ఎంత చెప్పుకున్నా తక్కువే .సెన్సిబుల్ లవ్ స్టోరీ ,యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ,డైరెక్టర్ సెల్వ రాఘవన్ స్క్రీన్ ప్లే ,హీరోయిన్ సోనియా అగర్వాల్ స్క్రీన్ ప్రెజెన్స్ ,కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఇలా అన్నిటి తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని సూపర్ హిట్ అందుకుంది.ఇక ఈ మూవీ రెగ్యులర్ లవ్ స్టోరీ లాగా ఉండదు,ఒక కాలనీ లో జరిగే టీనేజ్ లవ్ స్టోరీని డైరెక్టర్ సెల్వ రాఘవన్ చాలా అద్భుతంగా తెరెక్కించారు .ఇక 2004లో విడుదలైన “7/g రెయిన్ బో కాలనీ” అనే టైటిల్ తో తమిళ్ లో విడుదలై సంచలనము సృష్టించింది,ఇక ఇదే టైటిల్ “7/g బృందావన్ కాలనీ” గా తెలుగులో డబ్ అయ్యి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ చిత్రం గా నిలిచింది.కొన్ని లవ్ స్టోరీలు రియలిస్టిక్ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని డైరెక్టర్స్ కాస్త సినిమాటిక్ లిబర్టీ ని తీసుకొని తెరకెక్కిస్తారు ,అలానే ఇంకొన్ని లవ్ స్టోరీస్ మాత్రం రియల్ లైఫ్ లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారం చేసుకొని ,సినిమాలోని ఆ ఎమోషన్స్ ని పక్కాగా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసి సూపర్ హిట్స్ అందుకుంటారు దర్శకులు.

అసలు ఈ “7/g బృందావన్ కాలనీ సినిమా బేస్ పాయింట్ మాత్రం వైజాగ్ లో ఒక కాలనీ లో జరిగిన యదార్ధ సంఘటన ఆధారం చేసుకొని డైరెక్టర్ స్క్రీన్ మీద తనదైన శైలి లో తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నారు .ఇక ఈ సినిమా బుల్లి తెరలో ఎన్నిసార్లు వేసిన ఇప్పటికి చూస్తానే ఉంటారు ప్రేక్షకులు .ఇక సినిమాలోని మెయిన్ హై లైట్స్ విషయానికి వస్తే ,తండ్రి – కొడుకుల ఎమోషనల్ సీన్స్ ,కామెడీ సీన్స్ ,సాంగ్స్ ,లవ్ ట్రాక్ ,కాలేజ్ సీన్స్ ,ఇక సినిమా ఓపెనింగ్ సీన్ దగ్గర నుండి సినిమా ఎండింగ్ సీన్ వరకు అలా చూస్తూ ఉండిపోవాలసిందే .ఇక సాంగ్స్ విషయానికి వస్తే ” మేము వయసుకు వచ్చాం” అలానే “తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా నీకై నేను బ్రతికి ఉంటిని నీలో నన్నుచూసుకొంటిని’ అనే సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి .ఇక ఫైనల్ గా ఈ మూవీ ట్రెండ్ సెటర్ గా నిలిచింది.

అసలు వివరాల్లోకి వెళ్ళితే.ఈ సినిమా విడుదలైన దాదాపు 19 ఏళ్ల తర్వాత మూవీ యూనిట్ ఈ సినిమాకి సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నట్లుగా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి.గత కొంతకాలంగా సూపర్ హిట్ సినిమా “7/g బృందావన్ కాలనీ”మూవీకి త్వరలోనే ఒక సీక్వెల్ సిద్ధమవుతోందని అనే టాక్ గట్టిగా వినిపిస్తుంది.

Advertisement

అయితే ఈ సీక్వెల్ కు సంబధించి మూవీ యూనిట్ఎ టువంటి అఫీషియల్ ఎనౌన్సమెంట్ ఇవ్వలేదు .మరో పక్క సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ అంటే ఏ విధంగా ఉండబోతోందో అని అభిమానుల్లో క్యూరియాసిటీ ఉంది .ఇక చివరిగా ఈ మూవీకి సీక్వెల్ వస్తే చూడాలి అనే అభిమానులు చాలా మంది ఉన్నారు ,అలానే ఈ క్లాసిక్ హిట్ మూవీకి సీక్వెల్ తెరకెక్కించి సాహసం చెయ్యద్దు అనే వాళ్ళు ఉన్నారు.ఇక ఫైనల్ గా ఏది ఏమైనప్పటికి ఈమూవీకి సంబంధించి సీక్వెల్ రాబోతుంది అనే విషయంలో క్లారిటీ రావాలి అంటే అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చేంతవరకు ఎదురుచూడాలసిందే.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు