కోడిని చంపకుండా కోడి మాంసం తినొచ్చు తెలుసా? అదెలాగంటే?

కోడి కూర చ‌రిత్ర‌లోనే విప్ల‌వాత్మ‌క ప‌రిణామం రాబోతోందని మిలో ఎంతమందికి తెలుసు? కోడిని చంపకుండానే కోడి మాంసం ఇపుడు తినొచ్చు.అది కూడా బోన్‌లెస్‌ చికెన్.

 Did You Know That You Can Eat Chicken Without Killing It, How About That,hen, Vi-TeluguStop.com

పైగా ఈ మాంసంలో కొవ్వు శాతం కూడా చాలా త‌క్కువ‌ మోతాదులో ఉంటుంది.ఇందులో కావ్సాల్సిన స్థాయిలో ప్రొటీన్లు, విట‌మిన్లు ఉంటాయి.

ఈ కోడి మాంసం మాంసాహార ప్రియులకే కాకుండా శాఖాహారులకు, వివిధ కారణాలతో మాంసం తినడం మానేసిన వారికి కూడా ప్రత్యామ్నాయమని చెబుతున్నారు నిపుణులు.

ఇది సెల్‌ కల్చర్డ్‌ చికెన్‌.

ప్రతి 18–24 గంటలకు రెట్టింపయ్యే కణాల ద్వారా ఇక్కడ మాంసాన్ని ఉత్పత్తి చేస్తారు.దీనినే సెల్‌ కల్చర్డ్‌ చికెన్‌ అని అంటారు.

జంతు కణాల నుంచి ఉత్పత్తి చేసే ఈ సెల్‌ కల్చర్డ్‌ చికెన్‌ త్వరలో మార్కెట్‌లో అందుబాటులోకి రాబోతోంది.

Telugu Cellcultured, Chicken Curry, Chicken Meat, Latest-Latest News - Telugu

ఇలా కృత్రిమంగా పండిస్తున్న కోడి మాంసం తినడం ఎంతో సురక్షితమని కూడా AFDA (అమెరికన్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌) ఇటీవల ధ్రువీకరించింది.FDA అనుమతితో అమెరికాలో అప్‌సైడ్‌ ఫుడ్స్‌ అనే సంస్థ ఈ సెల్‌ కల్చర్డ్‌ చికెన్‌ను ఉత్పత్తి చేస్తోంది.పలు స్టార్టప్‌ ఫుడ్‌ కంపెనీలు ఈ తరహా మాంసం ఉత్పత్తికి సన్నాహాలు చేస్తున్నాయి కూడా.

Telugu Cellcultured, Chicken Curry, Chicken Meat, Latest-Latest News - Telugu

ఇక భవిష్యత్‌లో మాంసం మార్కెట్‌లో కల్చర్డ్‌ మాంసం ఉత్పత్తులు సింహభాగాన్ని ఆక్రమిస్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఈ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయ‌ని అంటున్నారు.ఇప్పటికే చంపబడిన జంతువుల నుంచి తయారు చేసే క్లీన్‌ మీట్‌కు సింగపూర్‌ రెగ్యులేటరీ ఆమోదం తెలపడం విశేషం.కణం నుంచి ఉత్పత్తి అయ్యే ఈ కల్చర్డ్‌ చికెన్‌లో ఒక్క చుక్క యాంటీబయాటిక్స్‌ ఉపయోగించరు.

దీనినే సెల్యులార్‌ వ్యవసాయం అని అంటారు.సెల్‌ కల్చర్డ్‌ మాంసాన్ని సృష్టించే ప్రక్రియ ఒక కణంతో మొదలవుతుంది.

ఒక కోడి నుండి బయాప్సీ ద్వారా కణాలను వేరు చేసి సెల్‌ బ్యాంక్‌ రూపొందిస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube