Sumer Singh Delhi : అద్భుతం, కరెంటు అవసరం లేని ఫుడ్ హీటర్‌ను కనిపెట్టిన ఐఐటీ ఢిల్లీ!

భారతదేశంలోని మారుమూల ప్రాంతాల్లో గ్యాస్ కనెక్షన్లు, కరెంటు పొయ్యిలు అందుబాటులో ఉండవు.

దీనివల్ల అక్కడ నివసించే ప్రజలు తమ ఆహారాన్ని వేడి చేసుకోవడానికి లేదా టీ, కాఫీ వంటివి తయారు చేసుకోవడానికి కట్టల మీదే ఆధారపడుతుంటారు.

ప్రతిసారీ ఇలా కట్టెల పొయ్యి వెలిగించడం అనేది కాస్త కష్టమే.కాగా దీనికి పరిష్కారంగా తాజాగా ఐఐటీ ఢిల్లీ కరంటే అవసరం లేని ఫుడ్ హీటర్‌ను డెవలప్ చేసింది.

ఆహారాన్ని వేడి చేయడం.వేడి పానీయం తయారు చేయడానికి ఈ హీటర్ పనికొస్తుంది.

సాధారణ నీటి ద్వారా దీనిని పని చేయించవచ్చు.ఆహారాన్ని వేడి చేయడానికి ఎలాంటి ఫ్యూయల్, ఎలక్ట్రిసిటీ అవసరం లేదని ఐఐటీ ఢిల్లీ అధికారులు వెల్లడించారు.

Advertisement

పవర్‌లెస్ హీటింగ్ టెక్నాలజీ అని పిలిచే ఈ సరికొత్త పరికరాన్ని ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, డిజైన్ డిపార్ట్‌మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సుమేర్ సింగ్.అతని రీసెర్చ్ టీమ్‌ రూపొందించింది.ఈ టెక్నాలజీలో యాక్టివ్ హీటింగ్ ఎలిమెంట్‌ ఉంటుంది.

ఈ డివైజ్‌లో ఎన్విరాన్మెంట్-ఫ్రెండ్లీ మినరల్స్, సాల్ట్స్ మిక్స్చర్ ఉంటుంది.ఇవి ఎక్సోథర్మిక్ శక్తిని ఉత్పత్తి చేస్తాయి, దీని ఫలితంగా నీటికి వేడి ఏర్పడుతుంది.

ఆ వేడి శక్తి ఏదైనా ఆహారం లేదా పానీయం ఉష్ణోగ్రతను 60 నుంచి 70 డిగ్రీల సెల్సియస్ వరకు పెంచడానికి సరిపోతుంది.

ఈ హీటర్ బరువు కేవలం 50 గ్రాములు కాబట్టి దీనిని ఎక్కడికైనా ఈజీగా తరలించవచ్చు.వేడి చేసుకున్న తర్వాత వేడి ప్యాడ్ లోపల ఉన్న సహజ ఖనిజ రాక్ అయిన ఉప-ఉత్పత్తిని పారవేయవచ్చు.ఈ టెక్నాలజీని ఉపయోగించి మీరు సిద్ధంగా ఉన్న ఆహారాన్ని వేడి చేయవచ్చు, ఇన్‌స్టంట్ నూడుల్స్ తయారు చేయవచ్చు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

టీ, కాఫీ మొదలైన డ్రింక్స్ తయారు చేయవచ్చు.ఈ టెక్నాలజీ వేడి చేసే ప్రయోజనాల కోసం విలువైన అటవీ కలపను కాల్చడాన్ని తన నీయంగా తగ్గిస్తుంది.

Advertisement

గుర్గావ్‌కు చెందిన స్టార్టప్ Anchiale Technologies ఈ టెక్నాలజీని విస్తృతం చేస్తోంది.

తాజా వార్తలు