NRIs income: ఎన్నారైల నుంచీ భారత్ కు రికార్డ్ బ్రేక్ ఆదాయం...ఎంతో తెలుసా...!!!

భారత్ నుంచీ ప్రపంచ దేశాలకు వలసలు వెళ్ళిన భారతీయులు అక్కడ స్థిరపడి భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు లేదా కుటుంబ సభ్యులకు సభ్యులకు డబ్బు పంపేందుకు, ఇతరాత్రా కారణాల ద్వారా డబ్బును పంపుతుంటారు.అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఊహించని స్థాయిలో ఈ ఏడాది అంటే 2022 లో రికార్డ్ బ్రేకింగ్ ఆదాయాన్ని ఎన్నారైలు భారత్ కు పంపారు.

 India's Record Breaking Income From Nris Do You Know How Much, Indians, Nris ,-TeluguStop.com

ఇది ఇప్పటి వరకూ ఉన్న అన్ని రికార్డ్స్ ను బ్రేక్ చేసిందట.పూర్తి వివరాలలోకి వెళ్తే.

అమెరికాతో పాటు ఇతర దేశాలలో ఉన్న భారతీయులు ఈ ఏడాది 2022 లో సుమారు 100 డాలర్ల కు చేరుకోనుందట.అంటే భారత కరెన్సీ లో దాని మొత్తం విలువ అక్షరాలా రూ.8 లక్షల కోట్లు పై మాటే.గామ్లో ఎన్నడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో ఈ మొత్తం ఉండబోతోందని అంటున్నారు ఆర్ధిక నిపుణులు.

ఇతర దేశాలకు వలస వెళ్ళిన మరే ఇతర దేశస్తులు కూడా ఈ స్థాయిలో ఆదాయం తమ దేశాలకు పంపడం లేదని కూడా తెలుస్తోంది.అయితే ఈ ఏడాది ఇంత భారీ స్థాయిలో డబ్బు పంపడానికి కారణం ఏంటంటే.

Telugu America, Financial, Indian Currency, Nris, Professionals-Telugu NRI

అగ్ర రాజ్యం అమెరికాతో పాటు కొన్ని ఇతర దేశాలలో వేగంగా కార్మికులకు, నిపుణులకు ఇచ్చే వెతనాలలో పెరుగుదలే అందుకు కారణమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.అయితే ఈ స్థాయిలో డబ్బు గనుకా పంపుతుంటే రూపాయి బలపడుతుందని, విదేశీ మారక నిల్వలో ఎన్నారైలు పంపే డబ్బే అత్యంత కీలకం అవుతుందని ఎగుమతులు, దిగుమతులు మధ్య వ్యత్యాసాన్ని తగ్గించేందుకు కూడా ఈ పరిణామం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపింది.ఇదిలాఉంటే వచ్చే ఏడాది మాత్రం ఎన్నారైలు పంపే డబ్బు ఈ స్థాయిలో ఉండే అవకాశాలు మాత్రం కనిపించవని అంటున్నారు నిపుణులు ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఆర్ధిక ఇబ్బందుల, ఉద్యోగాలలో కోతలు, పెరుగుతున్న ధరలు ఇందుకు కారణమని అంటున్నారు నిపుణులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube