షారుఖ్ ఖాన్ కూతురుపై రాక్షసంగా ట్రోల్స్.. పద్దతి మార్చుకో అంటూనే దారుణంగా?

సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీల వారసులకు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందే విపరీతమైన క్రేజ్ ఉంటుంది.

స్టార్ సెలబ్రిటీల పిల్లలు కావడంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వక ముందు మంచి క్రేజ్ ను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు.

అలాంటి వారిలోబాలీవుడ్ స్టార్ హీరో వారసురాలు సుహానా ఖాన్ కూడా ఒకరు.బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కుమార్తెనే సుహానా ఖాన్ ఇంకా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందే అప్పుడే ఈమెకు విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.

ఈమె తరచూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ పోస్ట్‌లు పెడుతూనే ఉంటుంది.ఇకపోతే ఆమెకు ఇన్‌స్టాగ్రామ్ లో 28లక్షల మంది ఫాలోయర్స్ ఉన్న విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా నెటిజన్స్ సుహానాను ట్రోల్ చేస్తున్నారు.మామూలుగా సెలబ్రిటీలు ఎక్కడ కనిపించినా కూడా ఫొటోగ్రాఫర్స్ అక్కడ వాలిపోతారన్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజాగా సుహానా ఖాన్ కూడా ఒక పని నిమిత్తం బయటకు వెళ్లింది.కారు దిగి వెంటనే లోపలికి వెళ్లిపోయింది.

ఫొటోగ్రాఫర్స్ కొంత మంది ఫోజులివ్వమని అడిగిన పట్టించుకోలేదు.దీంతో నెటిజన్స్ ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు.

చాలా ఘోరంగా ప్రవర్తిస్తుంది అని ఓ నెటిజన్ పోస్ట్ పెట్టారు.ఆమె ఆటిట్యూడ్ బాగాలేదు.

షారూక్ ఖాన్ అయితే ఈ విధంగా చేసేవాడు కాదు అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.కొంత మంది నెటిజన్స్ పద్ధతి మార్చుకొమంటున్నారు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

సుహానా సినీ ఇండస్ట్రీలోకి త్వరలోనే ఎంట్రీ ఇవ్వనుంది.అయితే ఆ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా సుహానా ఖాన్ పద్ధతిని మార్చుకోవాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

మరి ఇకపై అన్న సుహానా ఖాన్ తన ప్రవర్తన మార్చుకుంటుందా లేదో చూడాలి మరి.

తాజా వార్తలు