వావ్, వాట్ ఎ హెలికాప్టర్ షాట్.. వీడియో వైరల్..!

ఐపీఎల్ 2022 సీజన్‌లో యువ ప్లేయర్లు అదరగొట్టే బ్యాటింగ్‌తో ఫుల్ ఎంటర్టైన్మెంట్ పంచుతున్నారు.ముఖ్యంగా ముంబయి ఇండియన్స్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ బౌండరీల వర్షం కురిపిస్తూ వావ్ అనిపిస్తున్నాడు.

 What A Helicopter Shot Video Goes Viral , Ipl , Good Shot , Mi , Helicopter-TeluguStop.com

నిజానికి ఈ టోర్నీలో కాస్త ఆలస్యంగా జాయిన్ అయ్యాడు సూర్యకుమార్.ఇప్పటికి అతను రెండు మ్యాచ్‌లు ఆడగా, ఆ రెండింటిలోనూ హాఫ్ సెంచరీ చేశాడు.

కోల్‌కతా, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఓ రీసెంట్ మ్యాచ్‌లో కేవలం 36 బంతుల్లోనే 5 ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 52 స్కోరు చేశాడు.అంతేకాదు నిన్న రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కూడా ఇలాంటి అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ కనబరిచాడు.

కేవలం 37 బాల్స్ లో 5 ఫోర్లతో ఏకంగా 6 సిక్సర్లు బాది 68 పరుగులు సునాయాసంగా చేశాడు.అలాగే నాటౌట్ గా నిలిచాడు.

అయితే ఈ యువ బ్యాటర్ రాణించిన రెండు మ్యాచ్‌ల్లో కూడా ముంబయి అపజయం పాలవడం గమనార్హం.

ఇక నిన్నటి మ్యాచ్ లో మహ్మద్ సిరాజ్ బౌల్ చేసిన 19వ ఓవర్ లో 5వ బంతిని సూర్య కుమార్ లాంగ్ షాట్ ఆడాడు.

స్వ్కేర్ లెగ్ దిశగా బాదిన ఈ బంతి 98 మీటర్ల దూరంలో పడింది.ఈ సిక్స్ మ్యాచ్‌ మొత్తానికే హైలైట్‌గా నిలిచిందని అనడంలో సందేహం లేదు.నిజానికి ఈ షాట్ ని మామూలుగా ఆడితే దీని గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు కానీ సూర్యకుమార్ దీనిని ధోనీ వలె హెలికాప్టర్ షాట్ ఆడేశాడు.దీంతో అభిమానులతో పాటు క్రికెటర్లు కూడా ‘వావ్, వాట్ ఎ హెలికాప్టర్ షాట్’ అంటూ ఆశ్చర్యపోయారు.

ప్రస్తుతం ఈ హెలికాప్టర్ షాట్ కి సంబంధించి ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు కేవలం 18.3 ఓవర్లలోనే మూడు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది.దీంతో సురేష్ కుమార్ చేసిన హాఫ్ సెంచరీ వృధా అయ్యింది.మరి ఈసారైనా ముంబయి ఇండియన్స్ సూర్యకుమార్ యాదవ్ రాణించిన మ్యాచ్‌లో గెలుస్తుందో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube