టీఆర్పీ కోసం ఇలాంటి వేషాలు వేస్తారా?.. మల్లెమాలపై నెటిజన్లు ఫైర్

ప్రస్తుతం వెండితెర కంటే బుల్లితెరకే ఎక్కువ క్రేజ్ ఉందని చెప్పవచ్చు.

ఎందుకంటే బుల్లి తెర పై సీరియల్స్ హవాను పక్కనపెడితే ఎంటర్టైన్మెంట్ షోల హవా ఎక్కువ నడుస్తుంది.

దాదాపు అన్ని ఛానెల్స్ వాళ్లు ఎంటర్టైన్మెంట్ షోలకు బాగా ఆసక్తి చూపిస్తున్నారు.ప్రేక్షకులు కూడా బుల్లితెరపై ప్రసారమవుతున్న షో లకే బాగా అలవాటు పడుతున్నారు.

దీంతో ఎన్నో రకాల ఎంటర్టైన్మెంట్ షోలు ప్రసారమవుతున్నాయి.ఒకప్పుడు ఈ షోలు పర్ఫామెన్స్ వరకు బాగా ఆకట్టుకునేవి.

కానీ ఈ మధ్య వచ్చే షోలలో పర్ఫామెన్స్ లు చూస్తే మాత్రం తట్టుకోలేక పోవాల్సిందే.ఎందుకంటే కంటెస్టెంట్ లు, ఆర్టిస్టు చేసే తీరు అలా ఉంటుంది కాబట్టి.

Advertisement

ఇప్పటికే పలు షోలు విమర్శలు కూడా ఎదుర్కొన్నాయి.ఈటీవీలో మల్లెమాల ప్రొడక్షన్ లో ప్రసారమవుతున్న ఎంటర్టైన్మెంట్ షో లన్నీ హద్దులు దాటి పోయాయి అని చెప్పవచ్చు.

ముఖ్యంగా జబర్దస్త్ షో మాత్రం బాగా రెచ్చిపోయింది.ఇందులో కమెడియన్స్ మధ్య సాగే సన్నివేశాలు, వాళ్లు చెప్పే డైలాగ్స్ లు మాత్రం వర్ణించలేము.

కొన్ని కొన్ని సార్లు గొడవలు కూడా జరుగుతున్నట్లు చూపిస్తూ ఉంటారు.మరి టీవీ షోలు ఇలా ప్రవర్తించడానికి కారణం ఏంటంటే.

అత్యధిక రేటింగు సంపాదించుకోవడానికి అనే చెప్పాలి.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

చాలా వరకు రేటింగ్ కోసం బాగా దిగజారి పోతున్నారు కంటెస్టెంట్ లు.దీంతో ప్రేక్షకులు ఆ కంటెస్టెంట్ లకు ఏం జరుగుతుంది అని, అసలేం అవుతుందని షో చూడటానికి తెగ ఆసక్తి చూపిస్తారు.తీరా షో చూస్తే అందులో ఏమీ ఉండదు.

Advertisement

ఇదంతా ఫ్రాంక్ అని. నేరుగా చెప్పేస్తారు.దీంతో చూసే ప్రేక్షకులు ఆ ఫ్రాంక్ ను సీరియస్ గా తీసుకొని మరోసారి అటువంటి ట్విస్ట్ లను చూడటానికి ఇష్టపడరు.

అయినా కూడా కొన్ని ఎంటర్టైన్మెంట్ షోలు అలాగే ప్రవర్తిస్తున్నాయి.ఇదిలా ఉంటే తాజాగా మల్లెమాల పై నెటిజన్లు మరోసారి ఫైర్ అవుతున్నారు.ఇంతకు అసలేం జరిగిందంటే.

తాజాగా మల్లెమాల ప్రొడక్షన్ కు సంబంధించిన క్యాష్ షో ప్రోగ్రామ్ ప్రోమో విడుదల అయింది.అందులో కొందరు ఆర్టిస్టులు పాల్గొని సందడి చేశారు.

ఇక షోలో సుమ చేసే సందడి అంతా ఇంతా కాదనే చెప్పాలి.ఆ ఆర్టిస్టుల లో జబర్దస్త్ కమెడియన్ నరేష్ కూడా ఉండగా.

అతడు చాలా ఓవర్ చేశాడని చెప్పాలి.

సుమకు లవ్ ప్రపోజల్ చేస్తూ బాగా  రెచ్చిపోయాడు.ఇక సుమ మాత్రం తిరిగి రి కౌంటర్ వేసింది.ఇక షో చివరి రౌండ్ లో నరేష్ సుమ విషయంలో బాగా మితిమీరి ప్రవర్తించాడని చెప్పాలి.

చివరి రౌండ్లో పెద్దపెద్ద వస్తువులు జారుడు పడే స్థానంలో నిల్చొని.సుమతో నా ప్రేమను యాక్సెప్ట్ చేయకపోతే దూకుతానని బెదిరించి కింద పడిపోతాడు.అతడు నిజంగానే పడిపోయాడు అని వారంతా షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ పెడుతారు.

దీంతో ఈ ప్రోమో చూసిన వాళ్లంతా ఇటువంటి నాటకాలు మాకు తెలుసని.టిఆర్పీ కోసం ఇలాంటి వేషాలు వేస్తారా అని మల్లెమాల పై ఫైర్ అవుతున్నారు.

తాజా వార్తలు