ఈ భామ రూటే సపరేటు.. ఖరీదైన బైక్ కొన్న బిగ్ బాస్ బ్యూటీ.. ధర ఎంతంటే?

బిగ్ బాస్ షోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ ల లైఫ్ హౌస్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఎలా ఉంటుందో చెప్పటం చాలా కష్టం.

ఎందుకంటే బిగ్ బాస్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారు అదే క్రేజ్ తో సినిమాలలో నటిస్తూ మంచి మంచి ఆఫర్లతో దూసుకుపోతున్న వారు ఎంతో మంది ఉన్నారు.

ఇంకొంతమంది బిగ్ బాస్ ద్వారా బోలెడంత నెగిటివిటిని మూట కట్టుకొని బయటకు వెళ్తూ ఉంటారు.బిగ్ బాస్ హౌస్ లోకి మంచి పాపులారిటీ తో ఎంట్రీ ఇచ్చిన వారు బయటికి వెళ్ళేటప్పుడు బోలెడంత నెగిటివిటీవీ సంపాదించిన వారు ఎంతోమంది ఉన్నారు.

ఇకపోతే తెలుగు లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షో ఇటీవల ముగిసిన విషయం అందరికి తెలిసిందే.ఎప్పుడు లేని విధంగా ఈసారి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ షో గొడవలతో, ఊహించని ట్విస్ట్ లతో రసవత్తరంగా సాగింది.

ఇకపోతే ఈసారి ప్రసారం అయిన బిగ్ బాస్ సీజన్ 5 లో లేడీ అర్జున్ రెడ్డి గా గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ లహరి.బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇవ్వక ముందు వరకు లహరి పలు సినిమాల్లో నటించినప్పటికీ ఆమెకు తగిన గుర్తింపు దక్కలేదు.

Advertisement

కానీ బిగ్ బాస్ షోతో బోలెడంత ఫాలోయింగ్, పాపులారిటీని సంపాదించుకుంది.బిగ్ బాస్ తర్వాత వస్తున్న ఆఫర్లను అందుకుంటూ బిజీబిజీగా మారింది ఈ ముద్దుగుమ్మ.

ఇదిలా ఉంటే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే లహరి తాజాగా ఒక లగ్జరీ బైక్ ను కొనుగోలు చేసింది.ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.

మొత్తానికి నేను అనుకున్న విధంగా బైక్ కొన్నాను.నాకు చాలా సంతోషంగా ఉంది.నా బైక్ సౌండ్ చాలా నచ్చింది అంటూ ఆమె ఆనందం వ్యక్తం చేసింది.

ఇక ఆ ఫోటోలు వీడియోలు చూసిన పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్ లు, ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఇక ఈ లగ్జరీ BMW G 310 GS మోడల్‌కి చెందినది.మరి కొన్న ఈ బైక్ ధర దాదాపుగా 3-3.5లక్షలు ఉంటుంది.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు