న్యూస్ రౌండప్ టాప్ 20

1.నేడు యూపీ తొలిదశ ఎన్నికల నోటిఫికేషన్

నేడు యూపీలో తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ ఈసీ విడుదల చేయనుంది.

 

2.  భారత్ లో ఒమిక్రాన్

  దేశవ్యాప్తంగా 5753 ఒమి క్రాన్ కేసులు నమోదు అయ్యాయి. 

3.పరిటాల శ్రీరామ్ కి కరోనా పాజిటివ్

  ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది.తాజాగా టిడిపి నాయకులు మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. 

4.భారత్ లో కరోనా

  గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2.62 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. 

5.31 నుంచి పార్లమెంట్ సమావేశాలు

  పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈనెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. 

6.పీజీ మెడికల్ యాజమాన్య కోట సీట్ల భర్తీ

  పీజీ వైద్య విద్య కోర్సుల్లో యాజమాన్య కోటా సీట్ల భర్తీకి శనివారం నుంచి 22వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ప్రకటించింది. 

7.స్పైస్ జెట్ విమానం అత్యవసర ల్యాండింగ్

Advertisement

  స్పైస్ జెట్ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయిన సంఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది.హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లిన విమానానికి పొగ మంచు కారంగా ఏటీసీ అనుమతి ఇవ్వకపోవడం తో హైదరాబాద్ లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. 

8.20 వరకు రేషన్ పంపిణీ

  ఈ నెల 20 వరకు ఉచిత రేషన్ పంపిణీ చేపట్టాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 

9.ఎస్సార్ఎస్సి రెండో విడత కు నిధుల విడుదల

  ఎస్సార్ఎస్సి రెండో విడత కు నిధుల ను విడుదల చేస్తూ పౌర సరఫరాల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. 

10.19 నుంచి నీట్ యూజి కౌన్సిలింగ్

  అండర్ గ్రాడ్యుయేట్ జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష కౌన్సిలింగ్ ప్రక్రియ ను ఈ నెల 19 నుంచి ప్రారంభం అవుతుంది. 

11.కెసిఆర్ పై రేవంత్ రెడ్డి విమర్శలు

  ఉచితంగా ఎరువులు ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించారని తెలంగాణ సీఎం కేసీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. 

12.సంక్రాంతి సంబరాల్లో జగన్ దంపతులు

  తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం జగన్ , ఆయన సతీమణి భారతి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. 

13.తిరుమల లో చిరుత కలకలం

  తిరుమల 2 వ ఘాట్ రోడ్ లో చిరుత పులి సంచారం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. 

14.చిరు జగన్ భేటీ పై రోజా కామెంట్స్

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
పవన్ కళ్యాణ్ కి మద్దతుగా రామ్ చరణ్..!!

  మెగాస్టార్ చిరంజీవి, ఏపీ సీఎం జగన్ భేటీ కావడం శుభ పరిణామం అని నగరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజే అన్నారు. 

15.సింహాద్రి అప్పన్న సేవలో శ్రీ శారద తిరుపతి

  సింహాద్రి అప్పన్న ను శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి దర్శించుకున్నారు. 

16.ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు

Advertisement

  తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. 

17.తెలంగాణలో కరోనా

  గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 2707 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

18.కేఆర్ఎంబి  చైర్మన్ కు తెలంగాణ ప్రభుత్వం లేఖ

  తెలంగాణ కు కృష్ణ జలాలను అదనంగా కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణ నదీ యాజమాన్య బోర్డ్ కు లేఖ రాసింది. 

19.బోగీ మంటల్లో ఏపీ జీవోలు

  ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను టిడిపి శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా బోగీ మంటల్లో వేసి నిరసన వ్యక్తం చేశారు. 

20.ఈ రోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 47,110   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 49,110  .

తాజా వార్తలు