అంబానీయా మజాకా... ఈ దెబ్బతో అన్నీ లాభాలే ఇక

ముఖేష్ అంబానీ ఈ పేరు తెలియని ఇండియన్ ఉండడు.ముఖేష్ అంబానీ ఏ వ్యాపారం మొదలు పెట్టినా కానీ అది లాభాలు తెచ్చేదే అయి ఉంటుంది.

లాభం వచ్చే వ్యాపారాన్నే ముఖేష్ మొదలు పెడతాడని అంతా అనుకుంటారు.జియో ఎంట్రీతో అప్పటి వరకు ఉన్న ఇండియన్ టెలికం స్వరూపాన్నే మార్చేసిన ముఖేష్ అంబానీ తాజాగా గ్రోసరీ డెలివరీ రంగంలోకి కూడా అడుగుపెట్టారు.

ఇప్పుడు ఆయన తన దృష్టినంతా ఈ బిజినెస్ డెవలప్ చేసేందుకు కేంద్రీకరించారు.ఇప్పటికే ముఖేష్ అంబానీ డెలివరీ సరుకుల ప్లాట్ ఫాం జియో మార్ట్ మంచి లాభాలను ఆర్జిస్తుంది.

ఈ లాభాలను ఇంకా ఎక్కువ చేసేందుకు ఇప్పుడు ముఖేష్ వేసిన ప్లాన్ చూస్తే ఎవరైనా సరే మెచ్చుకోకుండా ఉండలేరు.ముఖేష్ అంబానీ తాజాగా గ్రోసరీలను డెలివరీ చేసే డంజోలో 25.8 శాతాన్ని కొనుగోలు చేశాడు.ఈ కొనుగోలు విలువ దాదాపు 1500 కోట్ల వరకు ఉంటుందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు.

Advertisement

డంజోకు చాలా నగరాల్లో సరుకులను డెలివరీ చేసే నెట్ వర్క్ ఉంది.డంజో తాజాగా డంజో డైలీ పేరుతో ఫాస్ట్ గా సరుకులను డెలివరీ చేసే సదుపాయాన్ని తీసుకొచ్చింది.

ఈ సంస్థలో ముఖేష్ పెట్టుబడులు పెట్టడం చూస్తే త్వరలోనే రిలయన్స్ జియో మార్ట్ను ఇంకా ఎక్కువ లాభాల్లోకి తీసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది.ఇక ఈ విషయం తెలిసిన చాలా మంది ముఖేష్ అంబానీకి ఉన్న వ్యాపార తెలివితేటలను చూసి వావ్ అంటూ మెచ్చుకుంటున్నారు.

ముఖేష్ అంబానీ కిరాణా సరుకులను డెలివరీ చేస్తాడంటేనే మొదట అందరూ వామ్మో అనుకున్నారు.కానీ ముఖేష్ ప్రస్తుతం తీసుకుంటున్న నిర్ణయాలను చూసి ప్రతి ఒక్కరూ షాక్ కు గురవుతున్నారు.

ముఖేషా మజాకా.కొడితే లాభాల పంట పండాల్సిందే మరి. ఈ వార్త ఇప్పుడు దేశ వ్యాప్తంగా హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు