అరెస్ట్ లు.. ఆందోళనలు ! బీజేపీ లక్ష్యం నెరవేరిందిగా ?

తెలంగాణలో ప్రస్తుతం టిఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా సాగుతున్న రాజకీయ వాతావరణం రోజురోజుకు మరింత ముదురుతోంది.

టిఆర్ఎస్ ను లక్ష్యంగా చేసుకుని బీజేపీ అనేక ఆందోళనలు చేపట్టడం, దానికి కౌంటర్ ఇస్తూ టిఆర్ఎస్ నాయకులు విమర్శలు చేయడం, బీజేపీ చేపట్టిన ఆందోళనలు , ఉద్యమాలను అణిచివేసేందుకు ప్రయత్నాలు చేయడం, ఇలా ఎన్నో అంశాలు తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తునే వస్తున్నాయి.

అది కాకుండా బీజేపీ ఎంపీ,  తెలంగాణ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ను టిఆర్ఎస్ ప్రభుత్వం అరెస్టు చేయించడం,  ఆయనకు 14 రోజుల రిమాండ్ కోర్టు విధించడం తో బీజేపీ నేతల్లోనూ కసి మరింతగా పెరిగింది.ఆ పార్టీ కేంద్ర నాయకుల నుంచి,  రాష్ట్ర నాయకుల వరకు అంతా ఇప్పుడు టిఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు.

         బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ కు వచ్చి టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేశారు.ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీఆర్ ప్రభుత్వం ను వదిలిపెట్టేది లేదని, తెలంగాణ ప్రభుత్వం ఎన్నో అవకతవకలకు,  అవినీతి వ్యవహారాలకు పాల్పడిందని , వాటన్నిటి లెక్కలు బయటకు తీస్తామని జేపీ నడ్డా హెచ్చరికలు కూడా జారీ చేశారు.

బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులంతా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి.ఇంత వరకూ ఈ వ్యవహారం ఇలా ఉంటే, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి బీజేపీకి అనుకూలంగా మారిందనే చెప్పాలి.

Advertisement

అసలు తెలంగాణలో ఉనికి కోసం ఆరాటపడుతున్న బీజేపీ వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో విజయాలు సాధిస్తూ ఇప్పుడు టిఆర్ఎస్ కు సవాల్ విసిరే స్థాయికి బలోపేతం అయ్యింది.     

   టిఆర్ఎస్ కు పోటి కాంగ్రెస్ అన్న పరిస్థితిని పూర్తిగా మార్చి వేసింది.రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఏమాత్రం ప్రభావం చూపించలేదు అన్నట్టుగా ఆ పార్టీలో పరిస్థితి నెలకొంది .ప్రజా సమస్యలు,  ఆందోళన వ్యవహారం అటుంచితే,  సొంత పార్టీ నాయకుల మధ్య ఏ విషయంలోనూ ఏకాభిప్రాయం లేకపోవడం,  గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడం, ఒకరిపై ఒకరు అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకుంటూ వస్తున్న పరిస్థితి.ఇప్పుడు సొంత పార్టీని చక్కదిద్దుకోవడమే తెలంగాణ కాంగ్రెస్ కు పెద్ద సవాల్ గా మారింది.

ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితి బీజేపీ కి ఆనందాన్ని కలిగిస్తున్నాయి.  టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే పార్టీగా తెలంగాణలో బీజేపీ బలపడిందని, మరింత గట్టిగా ప్రయత్నిస్తే అధికారంలోకి రావడం కష్టమేమీ కాదనే అభిప్రాయం ఇప్పుడు ఆ పార్టీ నాయకుల్లో కనిపిస్తోంది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు