IMDB మోస్ట్ అవైటెడ్ మూవీ లిస్ట్ రిలీజ్... తెలుగు సినిమాలు ఎన్ని ఉన్నాయో తెలుసా?

కరోనా మూలంగా చాలా సినిమాలు విడుదల కాలేదు.మరికొన్ని సినిమాలు అనుకున్న సమయానికి షూటింగ్ కూడా పూర్తి చేసుకోలేదు.

ప్రస్తుతం మనం చూస్తున్న చాలా సినిమాలు ఎప్పుడో విడుదల కావాలి.కానీ పరిస్థితులు అనుకూలించక ఇప్పుడు విడుదల అయ్యాయి.

ఇవే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించేలా ముందుకు వస్తున్న పలు సినిమాలు కూడా ఎప్పుడో విడుదల కావాలి.కానీ కాలేదు.2022లో మోస్ట్ అవైటెడ్ లిస్టును IMDB రిలీజ్ చేసింది.ఇంతకీ ఆ సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

KGF Chapter 2

ఈ నెలలోనే విడుదల చేయాలనుకున్న పరిస్థితులు కలిసి రాలేదు.దీంతో ఎప్రిల్ 14, 2022 విడుదలకు రెడీ అవుతోంది.

Advertisement

యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

RRR

ఈ సినిమా రిలీజ్ మూడుసార్లు వాయిదా పడింది.చివరక జనవరి 7, 2022 విడుదల చేస్తున్నారు.రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించాడు.

లాల్ సింగ్ చద్ధా

అమీర్ ఖాన్ హీరోగా అద్వైత్ చందన్ తెరకెక్కిస్తున్నాడు.నాగ చైతన్య ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తున్నాడు.ఎప్రిల్ 14, 2022 నాడు ఈ సినిమా విడుదల కానుంది.

గంగూభాయ్ కథాయ్‌వాడి

అలియా భట్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాను సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా అనుకోలేదు.

బీస్ట్

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ ఈ సినిమాను చేస్తున్నాడు.ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.100 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

దాఖ్డ్

Advertisement

ఈ సినిమాను కంగన రనౌత్ హీరోయిన్‌గా రజ్నీష్ ఘాయ్ తీస్తున్నాడు.ఈ సినిమా కోసం జనాలు వేచి చూస్తున్నారు.

రాధే శ్యామ్

ప్రభాస్ హీరోగా చేస్తున్న ఈ సినిమా జనవరి 14, 2022 విడుదల కానుంది.సంక్రాంతికి వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్.

బ్రహ్మాస్త్ర

రణబీర్ కపూర్, అలియా భట్ కలిసి నటిస్తున్న ఈ సినిమాను అయన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు.మూడు భాగాలుగా వస్తున్న ఈ సినమా తొలి భాగం సెప్టెంబర్ 9, 2022న విడుదల కానుంది.

హీరోపంటి 2

టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను అహ్మద్ ఖాన్ తెరకెక్కిస్తున్నాడు.విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు.

ఆదిపురుష్

ప్రభాస్ హీరోగా ఓం రౌత్ తెరకెక్కిస్తున్న మైథలాజికల్ విజువల్ వండర్ ఆదిపురుష్.ఇందులో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ నటిస్తుంది.2022 ఆగస్ట్ 11న ఈ మూవీ విడుదల కానుంది.

తాజా వార్తలు