టీఆర్ ఎస్ రాజ్య‌స‌భ సీటు అత‌నికేన‌ట‌..

టీఆర్ఎస్ రాజ్యసభ సీటుకు బండ ప్రకాశ్ రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఖాళీ ఏర్పడిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈ స్థానం కోసం అధిష్టానం ఎవరి పేరును సూచిస్తుందో అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఈ రేసులో ఇప్పటికే చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి.తొలుత ఈ స్థానానికి కల్వకుంట్ల కవితను ముఖ్యమంత్రి ఎంపిక చేస్తారని అంతా భావించారు.

అందుకోసమే బండ ప్రకాశ్ తన పదవికి రాజీనామా చేశారని పెద్ద ఎత్తున చర్చ నడిచింది.కానీ అనూహ్యంగా ఈ స్థానంలో కొత్త వ్యక్తిని ఎంపిక చేసినట్టు కథనాలు వస్తున్నాయి.

అయితే, రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగడంతో ఒక్కసారిగా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.ఎమ్మెల్యే కోటాలో ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్సీ స్థానాలను కేసీఆర్ భర్తీ చేశారు.

Advertisement

ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలకు డిసెంబర్ 10న పోలింగ్ జరగనుంది.రాష్ట్రంలో 12 స్థానాలకు ఆరు స్థానాలు ఏకగ్రీవం కాగా, మరో ఆరుస్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

కవిత ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియగా, మరోసారి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవం అయ్యారు.రాజ్యసభకు వెళ్లేందుకు కవిత సుముఖత వ్యక్తం చేయలేదని, ఎమ్మెల్సీగా గెలిపించుకుని కేబినెట్‌లోకి తీసుకునేందుకు కేసీఆర్ కూడా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

ఇక బండ ప్రకాష్ రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ ఎంపీ స్థానానికి సీఎం కేసీఆర్ ఎవరిని ఎంపిక చేస్తారో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.ఆ పదవి ఎవరిని వరించనుందోనని ఆశావహులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.కాగా, ఉన్నట్టుండి ఒక్కసారిగా నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్ రావు పేరు తెరమీదకు వచ్చింది.

గతంలోనే ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తానని వాగ్దానం చేశారట.ఇన్నిరోజులు టైం కూడా కలిసిరాలేదు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ప్రస్తుతం టైం రావడంతో ఆయన పేరును కేసీఆర్ ఖరారు చేసినట్టు లీక్స్ వస్తున్నాయి.చూడాలి మరీ ఇదైనా నిజం అవుతుందో లేదో.

Advertisement

తాజా వార్తలు