అత్యంత చెత్త రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ.. షాక్‌లో అభిమానులు!

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎన్నో అబ్బురపరిచే రికార్డులను క్రియేట్ చేసి అభిమానులను ఫిదా చేశాడు.

టాప్ క్లాస్ ప్లేయర్లలో ఒకరిగా రాణిస్తున్న కోహ్లీ తాజాగా మాత్రం ఓ చెత్త రికార్డ్ క్రియేట్ చేసి అభిమానులకు షాక్ ఇస్తున్నాడు.

ఆ చెత్త రికార్డ్ ఏంటి? గొప్ప ఆటగాడిగా పేరొందిన కోహ్లీ ఖాతాలోకి చెత్త రికార్డింగ్ ఎలా చేరింది? వంటి విషయాలు ఇప్పుడు చూద్దాం.ప్రస్తుతం ముంబాయి మహానగరంలో న్యూజిలాండ్, టీమిండియా జట్ల మధ్య హోరాహోరీగా రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే.

అయితే వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఖాతా తెరవకుండానే డకౌట్ అయ్యాడు.దాంతో స్వదేశంలో జరిగిన టెస్టు మ్యాచుల్లో ఏకంగా ఆరుసార్లు సున్నాకే పెవిలియన్ బాట పట్టిన ఇండియన్ కెప్టెన్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు.

నిన్నటిదాకా స్వదేశంలో ఆడిన టెస్ట్ మ్యాచ్‌ల్లో ఐదు సార్లకు మించి డకౌట్ అయిన భారతీయ కెప్టెన్లు లేరు.కానీ కోహ్లీ తాజాగా 0 పరుగులకే ఎల్బీడబ్ల్యూ ఔట్ అయ్యి ఆరుసార్లు డకౌట్ అయిన తొలి భారతీయ సారథిగా చెత్త రికార్డును తన పేరున లిఖించుకున్నాడు.

Advertisement

అతని తర్వాతి స్థానంలో మాజీ కెప్టెన్లు అయిన మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీ (5 సార్లు డకౌట్) కపిల్ దేవ్‌(3 సార్లు డకౌట్), మహేంద్ర సింగ్‌ ధోని(3 సార్లు డకౌట్) ఉన్నారు.అయితే స్వదేశంతో పాటు విదేశాల్లో ఆడిన అన్ని టెస్ట్ మ్యాచ్‌ల్లో కోహ్లీ ఇప్పటివరకు పది సార్లు సున్నా పరుగులకే ఔటయ్యాడు.

ఇదిలా ఉండగా రెండో టెస్ట్ లో కోహ్లీ ఔట్ కాస్తా వివాదంగా మారింది.ఎల్బీడబ్ల్యూ కాకముందే అంపైర్ ఔట్ ఇచ్చాడని కోహ్లీ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ మైదానాన్ని వీడాడు.దీనికంటే ముందు అతడు రివ్యూ కోరడంతో థర్డ్ అంపైర్ వీరేంద్ర శర్మ బంతిని సమీక్షించారు.

కానీ ఏ కోణంలోనూ స్పష్టత రాకపోవడంతో అతను కూడా ఔట్ అని తన నిర్ణయాన్ని ప్రకటించారు.దాంతో కోహ్లీ ఖాతా తెరవకుండానే క్రీజు విడిచిపెట్టాల్సి వచ్చింది.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు