ఆ ఇంట్లో ప‌డుకుంటే చాలు ల‌క్ష‌ల్లో జీతం.. అస‌లు విష‌యం తెలిస్తే

ఇళ్లు కొనాలంటే ఎన్నో ర‌కాలుగా దాని గురించి ఆలోచిస్తాం.అందులో ఉన్న స‌మ‌స్య‌లు, క‌లిసి వ‌చ్చే అంశాలు ఇలా అన్నింటినీ బేరీజు వేసుకుంటాం.

అంతే గానీ ఎలా ఉన్నా కొనాల‌ని మాత్రం అనుకోము.ఇక అక్క‌డ ఏదైనా ఉంద‌నే అనుమానాలు వ్య‌క్తం అయితే మాత్రం అటువైపు కూడా చూడం క‌దా.

మామూలుగా దెయ్యాలు అనే మాట వింటేనే ఆమ‌డ దూరం ప‌రుగెత్తుతాం.అలాంటి ఓ ఇంట్లో దెయ్యం ఉందంటే అటువైపు వెళ్తామా.

పైగా ఆ ఇంటిని కొనుగోలు చేయాలంటే ఎవ‌రైనా ముందుకు వ‌స్తారా.మ‌రి ఇలాంటి ఇండ్ల‌ను అమ్బాలంటే ఎలా.ఇలాంటి ఇండ్లు ఇప్పుడు చైనాలో బాగా పెరిగిపోతున్నాయి.అక్క‌డ కొన్ని ఏరియాల్లో ఉండే ఇండ్ల‌లో ఉండేందుకు ఎవ‌రూ ముందుకు రావ‌ట్లేదు.

Advertisement

పైగా అందులో దెయ్యాలు ఉన్నాయ‌నే క‌థ‌నాలు వెలువ‌డ‌టంతో వాటిని ఖాళీ చేసి వెల్లిపోతున్నారు.దీంతో వాటిని ఎలాగైనా అమ్మేయాల‌ని రియ‌ల్ ఎస్టేట్ కంపెనీలు రంగంలోకి దిగిపోయాయి.

ఇందులో భాగంగా ఆ కంపెనీలు ఓ ఆఫ‌ర్ చేశాయి.ఈ దెయ్యాల ఇంట్లో ప‌డుకునే ఉద్యోగాల‌ను సృష్టించాయి.

ఎవ‌రైనా ఈ ఇంట్లో ప‌డుకుంటే చాలు ఇంకేం చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని తెలిపాయి.ఇలా ప‌డుకుంటే గంటకు రూ.700 రూపాయ‌లు చెల్లిస్తామ‌ని ఆ కంపెనీలు ఆఫ‌ర్ చేశాయి.ఎవ‌రైనా స‌రే ఇందుకు అర్హులే అంటూ చెబుతున్నాయి.

అయితే వీరు త‌మ ప్రాణాల‌ను కూడా ప‌ణంగా పెట్టి ఈ ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.అయితే ఇలా ఉద్యోగం చేసే వారికి నెల‌కు ల‌క్ష‌ల్లో జీతం అందుతుంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

కానీ అక్క‌డి మీడియా క‌థ‌నాల ప్ర‌క‌రాం ఇలాంటి ఉద్యోగాల‌కు రావ‌డం చాలా క‌ష్టం అని తెలుస్తోంది.ఎందుకంటే చైనీయులు సాధార‌ణంగానే ఇలాంటి ఇండ్ల‌కు చాలా దూరంగా ఉంటారు.

Advertisement

అలాంటిది అదే ఇంట్లో ఉంటూ దెయ్యాలు లేవ‌ని నిరూపించ‌డం అంటే క‌ష్ట‌మే.

తాజా వార్తలు