79వ వసంతంలోకి జో బైడెన్‌: కమలా హారిస్, బరాక్ ఒబామా విషెస్..!!

అగ్రరాజ్యాధినేత, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శనివారంతో 79వ వసంతంలోకి అడుగుపెట్టారు.

ఈ సందర్భంగా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాలు ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

తన స్వస్థలమైన డెలావేర్‌లోని విల్మింగ్టన్‌లో రోజంతా ఉల్లాసంగా గడిపారు బైడెన్.ఈ సందర్భంగా ఆయన ఎలాంటి అధికారిక కార్యకలాపాల్లోనూ పాల్గొనలేదు.ఈ సందర్భంగా కమలా హారిస్ ట్వీట్ చేస్తూ.

‘‘ బైడెన్‌కు ఇది సంతోషకరమైన రోజు ’’ అని అన్నారు.అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి కూడా బడైన్‌కు విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు.

‘‘ మీ హృదయం, మీ మర్యాద, మీ దేశం పట్ల మీకున్న ప్రేమ.మీ నాయకత్వానికి అమెరికా కృతజ్ఞతలు’’ తెలుపుతోందన్నారు.

Advertisement

కాగా.డెమొక్రాట్‌లు బిల్డ్ బ్యాక్ బెటర్‌ అని పిలుస్తున్న సాంఘిక సంక్షేమ బిల్లును సెనేట్‌లో ప్రవేశపెట్టడాన్ని వారు బైడెన్‌కు ఇచ్చే బర్త్ డే గిఫ్ట్‌గా చెబుతున్నారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన ట్వీట్‌లో ఇలా అన్నారు.‘‘ తన స్నేహితుడు, సోదరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

మా అందరికీ మెరుగైన మౌలిక సదుపాయాలను బహుమతిగా ఇచ్చినందుకు ధన్యవాదాలు’’ అని ట్వీట్ చేశారు.కాగా.

గతేడాది చివరిలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యధిక ఓట్ల మెజారిటీతో 46వ అధ్యక్షుడిగా బైడెన్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఇప్పటివరకు ఏ అధ్యక్షుడికి కూడా అన్ని ఓట్లు రానంతగా ప్రజలు బైడెన్‌కు పట్టం కట్టారు.1970లలో అమెరికన్ రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన.1972లో 29 ఏళ్ల వయసులో తొలిసారిగా డెలావర్ సెనేటర్‌గా ఎన్నికయ్యారు.దేశ చరిత్రలో అతిచిన్న వయస్కుడైన సెనేటర్‌గా రికార్డుల్లోకెక్కారు.1987 నుంచి 1995 వరకు సెనేట్ జ్యూడిషియరీ కమిటీ అధ్యక్షుడి పనిచేశారు.1991లో గల్ఫ్ యుద్ధాన్ని వ్యతిరేకించారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

2009 నుంచి 2017 వరకు బరాక్ ఒబామా హయాంలో అమెరికా 47వ వైస్ ప్రెసిడెంట్‌గా సేవలందించారు.2009లో మౌలిక వసతుల పర్వవేక్షణ, 2010లో ట్యాక్స్ రిలీఫ్ యాక్ట్ తేవడానికి కృషి చేశారు.2017లో బైడెన్ ను ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ప్రీఢంతో ఒబామా సన్మానించారు.2019 ఏప్రిల్‌లో అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు.జూన్ 2020లో అధ్యక్ష పదవికి డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధిగా నామినేషన్ వేశారు.

Advertisement

తాజా వార్తలు