'పుష్ప' షూటింగ్ అప్డేట్ ఏంటో తెలియక జుట్టు పీక్కుంటున్నారు

పుష్ప విడుదల తేదీ దగ్గర పడుతోంది.ఇప్పటి వరకు షూటింగ్ పూర్తి చేసినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించలేదు.

పెద్ద ఎత్తున ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులు ఈ సినిమా ట్రైలర్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు.ఇప్పటికే మూడు పాటలను విడుదల చేసిన మేకర్స్ ముందు ముందు మరిన్ని ప్రమోషన్ వీడియోలను విడుదల చేయబోతున్నారు.

అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి అంటున్నారు.ఇటీవలే సినిమా చిత్రీకరణ విషయమై అప్డేట్‌ వచ్చింది.

సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి.వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టులతో సినిమా చివరి పాటను చిత్రీకరించేందుకు సిద్దం చేసిన పిక్స్ కూడా లీక్ అయ్యాయి.

Advertisement

మరి ఆ పాట పూర్తి అయ్యిందా లేదా అనేది తెలియాల్సి ఉంది.ఇంకా ఏమైనా షెడ్యూల్‌ బ్యాలన్స్ ఉందా అనేది కూడా చెప్పడం లేదు అంటూ అల్లు అర్జున్‌ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

సినిమా చిత్రీకరన మొదలు పెట్టినప్పటి నుండి ఏదో ఒక విషయంలో వార్తల్లో ఉంటూనే ఉన్న పుష్ప పై అంచనాలు పీక్స్ కు చేరాయి.ఆ అంచనాలు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు సుకుమార్‌ రంగస్థలం ను మించిన విధంగా ఈ సినిమాను రూపొందించాడనే వార్తలు వస్తున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా షూటింగ్ ను ఈ నెల చివరి వరకు పూర్తి చేస్తారనే టాక్ కూడా ఉంది.

డిసెంబర్ లో సినిమాను విడుదల చేసేలా ఇప్పటికే ప్లాన్ చేసినా కూడా షూటింగ్ విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వక పోవడం చర్చనీయాంశంగా మారింది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సినిమా షూటింగ్ ను సుకుమార్‌ చాలా జాగ్రత్తగా చేస్తున్నాడు.

ఆయన ప్రతి విషయంలో కూడా శ్రద చూపిస్తాడు.ఈ సినిమా విషయంలో కూడా అంతకు మించి అన్నట్లుగా ఆయన వ్యవహార శైలి ఉంది అనడంలో సందేహం లేదు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు