బిగ్ బాస్ 5 : ఈ వారం నో ఎలిమినేషన్..!

బిగ్ బాస్ సీజన్ 5 నుండి జశ్వంత్ అలియాస్ జెస్సీ అనూహ్యంగా హౌజ్ విడిచి వెళ్లాల్సి వచ్చింది.

హౌజ్ లో వర్టిగో వ్యాధితో బాధపడుతున్న జెస్సీ కొద్ది వారాలుగా హౌజ్ లో ఆటని సరిగా ఆడట్లేదు.

బిగ్ బాస్ టీం అతనికి డాక్టర్స్ తో ట్రీట్ మెంట్ ఇప్పిస్తున్నా సరే అతనికి నయం కాలేదని తెలుస్తుంది.అందుకే మంగళవారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ అతన్ని బయటకు పంపించేశాడు.

జెస్సీ బయటకు వెళ్తున్నాడని తెలిసి షణ్ముఖ్, సిరి బాగా బాధపడ్డారు.హౌజ్ మెట్స్ కూడా అదే విధంగా జెస్సీ ఎగ్జిట్ పై రియాక్ట్ అయ్యారు.

ఇక జెస్సీ ట్రీట్ మెంట్ కోసం బయటకు వెళ్లినా అతను దాదాపు తిరిగి హౌజ్ లోకి రాకపోవచ్చని అంటున్నారు.అందుకే ఈ కారణాల చేత ఈ వారం బిగ్ బాస్ ఎలిమినేషన్ ఉండదని చెప్పుకుంటున్నారు.

Advertisement

ఈ వారం రవి, కాజల్, సన్నీ, మానస్, సిరిలు నామినేషన్స్ లో ఉన్నారు.మాములుగా అయితే వీకెండ్ లో ఎలిమినేషన్ ఉంటుంది.

కాని జెస్సీ అనారోగ్య కారణంగా హౌజ్ నుండి బయటకు వచ్చాడు కాబట్టి ఈ వారం దాదాపు ఎలిమినేషన్ ఉండకపోవచ్చని అంటున్నారు.అలా అయితే ఈ వారం ఎలిమినేట్ అవ్వాల్సిన కాజల్ సేఫ్ అయినట్టే అని చెప్పుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు