గ‌ర్భిణీలు నువ్వులు తిన‌కూడ‌దా? అస‌లు తింటే ఏం అవుతుంది..?

నువ్వులు. వీటి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల్లో నువ్వులు కూడా ముందుంటాయి.

కాల్షియం, మెగ్నీషియం, ఐర‌న్‌, జింక్‌, ఫైబ‌ర్, విట‌మిన్ కె, విట‌మిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో కెమిక‌ల్స్ ఇలా పోష‌కాలెన్నిటినో క‌లిగి ఉండే నువ్వులు ఆరోగ్య ప‌రంగా అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.అందుకే నువ్వుల‌ను ఆహారంలో భాగంగా చేర్చుకుంటే మంచిద‌ని వైద్య నిపుణులు చెబుతుంటారు.

అయితే గ‌ర్భంతో ఉన్న స్త్రీలు మాత్రం నువ్వుల‌ను తీసుకోరాద‌ని చాలా మంది చెబుతుంటారు.అస‌లు గ‌ర్భిణీలు నువ్వులు ఎందుకు తిన‌కూడ‌దు.? తింటే ఏం అవుతుంది.? అన్న విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.సాధార‌ణంగా నువ్వులు శ‌రీరంలో వేడిని పెంచుతాయి.

వేడి చేసే ఆహారాలు తీసుకుంటే.గర్భస్రావం లేదా అకాల ప్రసవం జరిగే అవ‌కాశాలు ఉంటాయ‌ని చాలా మంది న‌మ్ముతుంటారు.

Advertisement

అందు వల్ల‌నే గ‌ర్భంతో ఉన్న మ‌హిళ‌ల‌కు నువ్వుల‌ను తీసుకోరాద‌ని చెబుతుంటారు.అయితే ప్రెగ్నెన్సీ స‌మ‌యం మొత్తం ఈ నియ‌మానికి క‌ట్టుబ‌డాల్సిన అవ‌స‌రం లేదు.

వాస్త‌వానికి గ‌ర్భం దాల్చిన మొద‌టి నాలుగు నెల‌లూ నువ్వుల‌కు దూరంగా ఉంటే స‌రి పోతుంది.ఆ త‌ర్వాత ఎటువంటి భ‌యం లేకుండా నువ్వుల‌ను తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.కాక‌పోతే చాలా ప‌రిమితంగా మాత్ర‌మే నువ్వుల‌ను తినాలి.

అలాగే గ‌ర్భిణీలు నువ్వుల‌ను తీసుకుంటే.ర‌క్త హీన‌త స‌మ‌స్య ద‌రి చేర‌కుండా ఉంటుంది.

ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో తీవ్రంగా ఇబ్బంది పెట్టే మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య దూరం అవుతుంది.రోగ నిరోధ‌క శ‌క్తి రెట్టింపు అవుతుంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

మ‌రియు నువ్వులు తింటే తల్లి, బిడ్డ ఇద్దరిలో నాడీ వ్యవస్థ, ఎముకలు స్ట్రాంగ్ గా మారాతాయి.అయితే మ‌ళ్లీ చెబుతున్న విష‌యం ఏంటంటే.

Advertisement

నువ్వుల‌ను చాలా మితంగా మాత్ర‌మే తీసుకోవాలి.అది కూడా గ‌ర్భం పొందిన‌ నాలుగు నెల‌ల త‌ర్వాతే తీసుకోవాలి.

తాజా వార్తలు