నిప్పు లేనిదే పొగ రాదు.. మరి 'ఆత్మా' పరిస్థితి ఏంటీ?

తెలుగు సామెత నిప్పు లేనిదే పొగ రాదు.పొగ వచ్చిన తర్వాత నిప్పు లేదు అంటే ఖచ్చితంగా అది నమ్మశక్యంగా ఉండదు.

ఇండస్ట్రీలో పుకార్లు కూడా అంతే ఏదో ఊరికే పుకార్లు పుట్టేయవు.పావులా ఉంటే రూపాయి మీడియా చూపిస్తుంది వాస్తవమే కాని.

అస్సలే లేని మ్యాటర్ ను మాత్రం ఖచ్చితంగా మీడియా చూపించదు అనేది పాయింట్‌.మీడియాలో వచ్చింది అంటే కొంతలో కొంత అయినా నిజం ఉంటుంది అనడంలో సందేహం లేదు.

ప్రతి ఒక్కరు కూడా మీడియాలో వార్తలను విమర్శిస్తారు కాని ఆ వార్తలు రావడంకు కారణంను విశ్లేషించాల్సిన అవసరం ఉంది.నిన్న సాయంత్రం మా ఎన్నికల్లో ప్రకాష్ ప్యానల్‌ తరపున పోటీ చేసి గెలిచిన వారు రాజీనామా చేసేందుకు మీడియా సమావేవం ఏర్పాటు చేయడం జరిగింది.

Advertisement

ప్రకాష్ రాజ్ మీడియా సమావేశం సాయంత్రం 5 గంటలకు అంటూ ప్రకటన వచ్చింది.మద్యాహ్నం సమయంలో వచ్చిన ఆ ప్రకటన కొన్ని గంటల పాటు మీడియాలో హై అలర్ట్ ను క్రియేట్‌ చేసింది.

సోషల్‌ మీడియా నుండి మొదలుకుని మెయిన్‌ స్ట్రీమ్ మీడియా వరకు ప్రతి ఒక్కరు కూడా మా కు పోటీగా ఆత్మా ను ప్రకాష్‌ రాజ్‌ ప్రారంభించబోతున్నట్లుగా అందులో కథనాలు వచ్చాయి.ఆల్‌ ఇండియా తెలుగు మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్ అంటూ ఒక కొత్త సంఘంను ప్రకాష్‌ రాజ్ తీసుకు రాబోతున్నాడు.దీనికి ఖచ్చితంగా మెగా సపోర్ట్ ఉంటుందని కూడా వార్తలు వచ్చాయి.

ఓ రేంజ్ లో ఆత్మ గురించి ప్రచారం జరిగిన నేపథ్యంలో ప్రకాష్ రాజ్ మాట్లాడే మాటలకు ప్రాముఖ్యత ఏర్పడింది.ఏం జరుగుతుంది.ఎలా అవుతుంది అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో ఆత్మా లేదు పరమాత్మా లేదు అంటూ ప్రకాష్ రాజ్ ప్రకటించాడు.

ఆయన ఆత్మ అనుకున్న మాట వాస్తవం కాని ఆయన్ను కొందరు మా పెద్దలు వారించారని.ఇప్పటికే పోయిన పరువు చాలు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఇంకా కూడా పరువు పోగొట్టేలా చేయవద్దంటూ వారించారని గుసగుసలు వినిపిస్తున్నాయి.అందుకే ఆత్మా ను పుట్టక ముందే చంపేశారు అనేది టాక్‌.

Advertisement

ప్రకాష్ రాజ్ టీమ్‌ నుండే ఆత్మాకు సంబంధించిన వార్తను ఒకరు లీక్ ఇచ్చారు.వారు అనుకున్న విషయమే కాని పెద్దలు వద్దనడంతో ఆగాల్సి వచ్చిందని అంటున్నారు.

తాజా వార్తలు