ఈ ఫోటోలో మహేష్ పక్కన ఉన్న బుడతడు ఎవరో మీరు గుర్తుపట్టారా?

సూపర్ స్టార్ మహేష్ బాబు చివరి మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కాగా మహేష్ భవిష్యత్తు సినిమాలకు సైతం సక్సెస్ లో ఉన్న డైరెక్టర్లు దర్శకత్వం వహిస్తున్నారు.

సరిలేరు నీకెవ్వరు సినిమాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో కూడా ఇండస్ట్రీ హిట్ ను సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు.

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ హీరోగా ఒక సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే.తాజాగా మహేష్ బాబుతో పాటు ఒక బుడతడు ఉన్న ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

మహేష్ బాబుతో ఉన్న ఆ బుడతడు ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నాడు.టాలీవుడ్ ఫ్యామిలీ హీరోలలో ఒకరైన శ్రీకాంత్ తనయుడు రోషన్ ఈ బుడతడు కావడం గమనార్హం.

రోషన్ ఇప్పటికే నిర్మలా కాన్వెంట్ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే.ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేదు.

Advertisement

ప్రస్తుతం రోషన్ పెళ్లి సందడి సీక్వెల్ లో నటిస్తుండగా త్వరలోనే ఆ సినిమా రిలీజ్ కానుంది.

రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో బాగానే అంచనాలు నెలకొన్నాయి.రోషన్ పెళ్లిసందడి సీక్వెల్ తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంటారో లేదో చూడాల్సి ఉంది.శ్రీకాంత్ కు హీరోగా ఆఫర్లు తగ్గిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అవుతున్నారు.

యుద్ధం శరణం సినిమాలో విలన్ గా నటించిన శ్రీకాంత్ కు ఆ సినిమా రిజల్ట్ నిరాశపరిచింది.అఖండ సినిమాతో విలన్ గా తొలి బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకోవాలని శ్రీకాంత్ భావిస్తున్నారు.అఖండ మూవీ దసరాకు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు