గుహలో చెక్కబడిన శివుడి ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?

మన దేశంలో ఎంతో అద్భుతమైన, ఎంతో ప్రాచుర్యం పొందిన ఆలయాలు ఉన్నాయి.అదే విధంగా ఎన్నో ఆలయాలు గుహలలో నిర్మితమై ఉండి భక్తులకు దర్శనం ఇస్తున్నాయి.

ఈ విధంగా ఎంతో ప్రసిద్ధి చెందిన గుహలలో ఎలిఫెంటా గుహలు ఒకటి.మహారాష్ట్ర రాష్ట్రం, ముంబైలో ఘరాపురి దీవి ఉంది.

 ఘరాపురి అంటే గుహల నగరం అని అర్ధం. ఇక్కడే ఎలిఫెంటా గుహలు ఉన్నాయి.

ఈ గుహలను సందర్శించడానికి పర్యాటకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటారు.ఈ గుహలకు బయట ఏనుగులు ఉండటం చేత పోర్చుగీసు వారు ఈ గుహలకు ఎలిఫెంటా గుహలని నామకరణం చేశారు.

Advertisement

ఈ గుహలు సుమారు 60 వేల అడుగుల వెడల్పు ఉండటంతో వీటిని తొలచి మధ్యలో శివ మందిరాన్ని ఎంతో అద్భుతంగా నిర్మించారు.ఇక్కడి శాసనాల ప్రకారం 9 నుంచి 13 వ శతాబ్దానికి చెందిన రాజులు ఈ గుహలను నిర్మించినట్లు చెబుతున్నాయి.

ఇలా రాతితో చెక్కబడిన ఈ గుహలలో శివుడు కొలువై ఉండి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు.ఈ గుహలలో శివుడు లింగాకారంలో తూర్పు ద్వారం వైపు ప్రతిష్టించబడి ఉంది.

అలాగే శివుడు జీవిత ఘట్టాలను తెలుపుతూ తొమ్మిది శిలాఫలకాలు మందిరంలో ఏర్పాటు చేశారు.

అదేవిధంగా ఈ గుహలో ప్రతిష్టించిన త్రిమూర్తుల విగ్రహం ఏకంగా 15 అడుగుల ఎత్తు ఉండి భక్తులకు దర్శనమిస్తోంది.ఇక ఈ గుహలో వెలసినటువంటి శివుడు పంచభూత అవతారంలో, భూమి, గాలి,ఆకాశం, నీరు, నిప్పు వంటి పంచభూతాలతో శివుడు పంచభూతాల శిరస్సును కలిగి ఉండడం విశేషం .ఇలా పంచభూతాలను కలిగిన పరమేశ్వరుడు ఈ గుహలలో కొలువై ఉండి భక్తులకు దర్శనమిస్తున్నారు.ఈ ఆలయంలో శివుడిని దర్శించడం కోసం పర్యాటకులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు