బద్వేల్ ఉప ఎన్నికల అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు

త్వరలో జరగనున్న బద్వేల్ ఉప ఎన్నికకు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ సన్నద్ధమవుతోంది.

ఎప్పుడు ఎన్నికలు జరిగిన అధికార వైసీపీకి గట్టిపోటీని ఇవ్వాలని అందుకోసం ఇప్పటి నుండి ఉప ఎన్నికలకు టీడీపీ సిద్ధమవుతోంది.

అందులో భాగంగా శుక్రవారం కడప జిల్లా నేతలతో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు.తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన ఓబులాపురం రాజశేఖర్ ను తిరిగి పోటీలోకి దించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.ఆ దిశగా పార్టీ ముఖ్య నేతలకు రాజశేఖర్ పోటీ చేయబోతున్నారు ఆయన గెలుపు కోసం ఇప్పటి నుండి కృషి చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.2019 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బద్వేల్ నుంచి వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ వెంకట సుబ్బయ్య పోటీ చేసి గెలుపొందారు.అయితే ఆయన అనారోగ్యంతో మార్చి 28వ తేదీన మృతి చెందారు.

దీంతో బద్వేల్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.అయితే గత ఎన్నికల్లో వెంకటసుబ్బయ్య చేతిలో ఓటమి పాలైనా రాజశేఖర్ నే తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకొని ఆ దిశగా పార్టీ శ్రేణులకు ఇప్పటి నుండే ఉప ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు