మెగా మూవీలో మరొక ఛాన్స్ అందుకున్న అనసూయ..?

అనసూయ.ఈ పేరును పెద్దగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు.

అనసూయ అటు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూనే ఇటు వెండితెర మీద కూడా మంచి మంచి అవకాశాలు అందుకుంటూ దూసుకు పోతుంది.అనసూయ కెరీర్ ఇప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది.

చేతినిండా అవకాశాలను అందుకుంటూ మంచి మంచి పాత్రలు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువవుతుంది.ప్రస్తుతం అనసూయకు మెగా కాంపౌండ్ నుండి వరుస అవకాశాలు అందుతున్నాయి.

ఇప్పటికే రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో రంగమత్త పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత ప్రస్తుతం అనసూయ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమాలో కూడా అవకాశం ఇచ్చాడు సుకుమార్.

Advertisement

ఈ సినిమాలో కూడా అనసూయకు మంచి పాత్ర వచ్చిందని టాక్.ఇప్పటికే పుష్ప సినిమాలో అనసూయ తన షూటింగ్ పూర్తి చేసుకుంది.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అనసూయకు మరొక మెగా మూవీలో అవకాశం వచ్చిందని తెలుస్తుంది.

అది కూడా మెగాస్టార్ కొత్త సినిమా గాడ్ ఫాదర్ లో అట.ఇదే నిజమైతే అనసూయ లక్ మాములుగా లేదనే చెప్పాలి.ఈ మధ్యనే మెగాస్టార్ లూసిఫర్ రీమేక్ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమాను మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నాడు.ఈ రీమేక్ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ ఫిక్స్ చేసారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనసూయ ఒక పవర్ ఫుల్ రోల్ లో కనిపించ బోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.ఇదే కనుక నిజమైతే అనసూయకు మరికొన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది.ఈ సినిమా ఎలాగూ చిరంజీవి మ్యానియాతో సూపర్ హిట్ అవుతుంది.

Advertisement

దీంతో అనసూయ మరికొన్ని అవకాశాలు అందుకున్న ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.

తాజా వార్తలు