హీరో నాని అసలు పేరు ఏంటో తెలిస్తే అవాక్కవుతారు...

తెలుగు చలన చిత్ర పరిశ్రమకి అవకాశాల కోసం వచ్చిన కొత్తలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి ఆ తర్వాత క్రమక్రమంగా పలు చిత్రాలలో హీరోగా నటించే అవకాశాలు దక్కించుకుని ప్రస్తుతం నేచురల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ ప్రముఖ హీరో "నాని" గురించి కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.

అయితే నాని సినిమా పరిశ్రమకి వచ్చిన కొత్తలో అవకాశాల కోసం బాగానే ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.

ఆ తర్వాత హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా పలు చిత్రాలకి నిర్మాతగా కూడా వ్యవహరించి యంగ్ డైరెక్టర్స్ ని బాగానే ప్రోత్సహిస్తున్నాడు.ఆ మధ్య నాని నిర్మాతగా వ్యవహరించిన "హిట్" ది ఫస్ట్ కేస్ చిత్రం బాక్సాఫిస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది.

దీంతో నాని హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా బాగానే విజయం సాధించాడని చెప్పవచ్చు.అయితే ఇప్పటికీ చాలా మందికి హీరో నాని అసలు పేరు ఏమిటనే విషయం తెలియదు.

కాకా హీరో నాని అసలు పేరు "నవీన్ బాబు గంటా". అంతేకాకుండా హీరో నాని మరియు టాలీవుడ్ ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఇద్దరూ కలిసి చిన్నప్పుడు ఒకే పాఠశాలలో చదువుకున్నారు.

Advertisement

కాగా నాని 2012వ సంవత్సరంలో అంజన అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.ప్రస్తుతం వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు.

ఇటీవల హీరో నాని కొడుకు అర్జున్ గంటా కూడా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తూ బాగానే రాణిస్తున్నాడు.

ఈ విషయం ఇలా ఉండగా ఎప్పుడూ విభిన్న తరహా కథలు ఎంచుకుంటూ ప్రేక్షకులను తనదైన శైలిలో ఆకట్టుకునే నాని ప్రస్తుతం తెలుగులో దాదాపుగా మూడు చిత్రాలలో హీరోగా నటిస్తున్నాడు.అయితే ఇందులో ఇప్పటికే "టక్ జగదీష్" అనే చిత్రం షూటింగ్ పనులను పూర్తి చేసుకోగా శ్యామ్ సింగరాయ్ మరియు అంటే సుందరానికి తదితర చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.కాగా టక్ జగదీష్ ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు