ఆమె లేకపోతే నేను లేను.. నటి రాధ సంచలన వ్యాఖ్యలు!

80వ దశకంలో తెలుగు, తమిళ భాషల్లో నటిగా రాధ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.తెలుగులోని చాలామంది అగ్రహీరోలతో రాధ నటించారు.

దాదాపు 250కు పైగా సినిమాలలో రాధ నటించడం గమనార్హం.ఈమె అక్క అంబిక కూడా సినిమా నటి.తమిళంలో రాధ కమల్, రజనీకాంత్, శివాజీ గణేషన్ లకు జోడీగా నటించారు.పదుల సంఖ్యలో సినిమాలలో రాధ నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి.

కెరీర్ లో వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న సమయంలోనే రాధ బొంబాయికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తను వివాహం చిసుకున్నారు.పెళ్లి తర్వాత రాధ సినిమాలకు దూరంగా ఉన్నారు.

బొంబాయిలో రాధ సొంతంగా రెస్టారెంట్ ను నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.రాధ కూతురు కార్తీక తెలుగులో పలు సినిమాల్లో నటించి ఆశించిన స్థాయిలో నటిగా సక్సెస్ సాధించకపోవడంతో సినిమాలకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.

Advertisement

అయితే రాధ నటిగా సక్సెస్ కాకముందే సినిమా ఇండస్ట్రీలో అంబిక నటిగా ఒక వెలుగు వెలిగారు.అక్క ప్రోత్సాహం, అడుగుజాడల్లో నడవడం ద్వారానే రాధ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సులువుగా సొంతం చేసుకోగలిగారు.అక్క అంబిక అంటే రాధకు ఎంతో ఇష్టం కాగా ఈరోజు అంబిక పుట్టినరోజు కావడంతో రాధ అంబిక గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

సోదరి అంబికకు రాధ బర్త్ డే గ్రీటింగ్స్ తెలియజేశారు.అంబిక లేకపోతే తాను కూడా ఉండేదానిని కాదని రాధ పేర్కొన్నారు.అంబిక తన అక్క మాత్రమే కాదని గొప్ప నటి అని ఆమె తెలిపారు.

సినిమానే లైఫ్ గా భావించే వ్యక్తి అంబిక అని రాధ చెప్పుకొచ్చారు.అక్కపై తనకు ఉండే ఇష్టాన్ని నటి రాధ సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేయడం గమనార్హం.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు