F3 లో వెంకీ, వరుణ్ పాత్రలపై లేటెస్ట్ అప్డేట్ !

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్ 2 సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.

సంక్రాంతి అల్లుళ్లుగా బరిలోకి దిగి నవ్వులు పూయించారు.

ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ నటించారు.ఈ సినిమాలో వెంకటేష్ సరసన తమన్నా నటిస్తుంటే.

వరుణ్ సరసన మెహ్రీన్ నటిస్తుంది.అయితే ఈ సినిమా హిట్ అవ్వడంతో మరింత ఫన్ తో F3సినిమాను మన ముందుకు తీసుకు రాబోతున్నారు.

ఈ సినిమా ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది.అనిల్ రావిపూడి మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరూ సినిమా చేసి సూపర్ హిట్ అందుకోవడంతో ఇప్పుడు ప్రేక్షకులు F3 సినిమాపై అంచనాలు పెంచుకున్నారు.

Advertisement

ఈ సినిమా ఆగస్టు 27 న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు కానీ మధ్యలో కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడడంతో ఈ సినిమా 2022 సంక్రాంతి బరిలో దిగబోతుందని ఇటీవలే వెంకటేష్ కన్ఫర్మ్ చేసాడు.

అయితే తాజాగా ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ పాత్రలపై ఒక ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో బాగా వినిపిస్తుంది.ఈ సినిమాలో వెంకటేష్ రేచీకటి ఉన్న పాత్రలో నటిస్తుంటే వరుణ్ తేజ్ నత్తి ఉన్న పాత్రలో నటిస్తున్నట్టు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.ఈ రెండు పాత్రలతో ఈ సినిమా ఫన్నీగా సాగుతుందని టాక్ నడుస్తుంది.

అయితే ఇలాంటి పాత్రలలో నటించడం నిజంగా గ్రేట్ అనే మాటలు వినిపిస్తున్నాయి.ఎక్కువ మంది హీరోలు ఇలాంటి పాత్రలు చేయడానికి అంతగా ఆసక్తి చూపారు.ఇంత వరకు చిత్ర యూనిట్ నుండి ఎలాంటి అప్డేట్ అధికారికంగా రాలేదు.

కానీ ఈ సినిమాను ఎఫ్ 2 కన్నా మరింత ఫన్ ఉండేలా తెరకెక్కిస్తున్నట్టు డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలిపాడు.మరి చూడాలి ఈ పాత్రలు కనుక నిజమైతే తెరపైన మరింత ఫన్ రావడం పక్కా.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు