ఈ వారసులు సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తారో?

సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలంటే టాలెంట్ అవసరం లేకున్నా బ్యాగ్రౌండ్ ఉంటే చాలు.

కానీ అడుగు పెట్టాక ఆదరించాలంటే మాత్రం కచ్చితంగా యాక్టింగ్ లో దమ్ము ఉండాలి.

తమ నటనతో జనాలను ఆకట్టుకుంటే ఇండస్ట్రీలో నిలిచి ఉంటారు.లేదంటే ఇలా వచ్చి.

అలా వెళ్లిపోతారు.ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి డజను మంది హీరోలు పరిచయం అయ్యారు.

అక్కినేని ఫ్యామిలీ నుంచి అరజను మంది వచ్చారు.నందమూరి ఫ్యామిలీ.

Advertisement

దగ్గుబాటి ఫ్యామిలీ.ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కూడా నటీనటులు ఎంట్రీ ఇచ్చారు.

ఇందులో చాలా మంది తమ టాలెంట్ నిరూపించుకుని ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు.కొందరు మాత్రం మొదటి సినిమాకే పరిమితం అయ్యారు.

ప్రస్తుతం మరికొంత మంది నటవారసులు సినిమా పరిశ్రమకు పరిచయం కాబోతున్నారు.కొంతకాలంగా మెగా వారసుడు అకీరా.

ఘట్టమనేని వారసుడు గౌతమ్ కృష్ణ. నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎప్పుడు సినిమాల్లోకి అడుగు పెడతారా? అని జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.తన కొడుకు సినిమాల్లోకి వస్తాడని బాలయ్య ఇప్పటికే ప్రకటించాడు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!

ఆయన కోసం పలువురు దర్శకులు స్టోరీలు కూడా రెడీ చేసుకున్నారు.త్వరలోనే తను సినిమాల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

అటు మహేష్ బాబు వారసుడు గౌతమ్ కృష్ణ కూడా సినిమాల్లోకి వస్తాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే గౌతమ్ వన్ నేనొక్కడినే సినిమా ద్వారా జనాలను పలుకరించాడు.తాజాగా సోషల్ మీడియాతో మాట్లాడిన మహేష్.గౌతమ్ సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడనేది కాలమే చెప్తుందని వ్యాఖ్యానించాడు.

అయితే ప్రస్తుతం చదువుకుంటున్న గౌతమ్.సినిమాల్లోకి రావడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది.

అటు పవన్ కొడుకు అకీరా నందన్ కూడా తల్లి రేణు దేశాయ్ దర్శకత్వం లో వచ్చిన మరాఠీ సినిమా ఇష్క్ వాలా లవ్ లో వెండి తెరపై మెరిసాడు.అయితే ప్రస్తుతం తను స్టడీస్ మీద కాంసెంట్రేట్ చేశాడని రేణు దేశాయ్ వెల్లడించింది.

పెద్దయ్యాక సినిమాల్లోకి వస్తాడా? రాడా అనే అశంపై తను మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

తాజా వార్తలు