జగన్ మేల్కోవాల్సిందే ... తీరు మార్చుకోవాల్సిందే ? 

వైసిపి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్ ఎప్పుడూ జనాల్లో ఉండే వారు.

నిరంతరం ప్రజా సమస్యలపై ఏదో ఒక పోరాటం చేస్తూ, పార్టీ నాయకుల్లో ఉత్సాహం తీసుకురావడంతో పాటు, అప్పటి టీడీపీ ప్రభుత్వం పైన తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచుతూ, ప్రభుత్వ పరపతిని తగ్గిస్తూ, వైసీపీ ఇమేజ్ పెరిగేలా చేసుకోవడం లో సక్సెస్ అయ్యారు.

అంతేకాదు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టి జనాలకు మరింత దగ్గరయ్యారు.పాదయాత్ర సమయంలో ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కార మార్గాలను అప్పుడే ఆలోచించుకున్నారు.

వైసిపి అఖండ మెజార్టీతో విజయం సాధించిన తర్వాత జగన్ వెంటనే పాదయాత్రలో తాను తెలుసుకున్న సమస్యలను, వివిధ పథకాల రూపంలో తీసుకు వచ్చి ప్రజల్లో తన పరపతి పెంచుకున్నారు.నిరంతరం ఏదో ఒక కొత్త పథకాన్ని ప్రవేశ పెడుతూనే జనాలకు మేలు చేకూర్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే జగన్ అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు సంతృప్తి కలిగేలా చేస్తున్నా, కొన్ని కొన్ని వ్యవహారాలు మాత్రం ప్రభుత్వ క్రెడిట్ ను దెబ్బతీసే విధంగా మారాయి.జగన్ నిత్యం అధికారులతో అనేక సమీక్షలు చేస్తూనే ఉన్నారు.

Advertisement

ప్రభుత్వ పథకాలకు సంబంధించి అవి ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా లేదా అనేది జగన్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు.అయితే కొంతమంది అధికారుల తీరు కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని గుర్తించిన జగన్ ఈ విషయంలో అలసత్వం వహిస్తున్న అధికారులు అందరికీ మెమోలు జారీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

తాను ప్రభుత్వ పథకాలు అమలు చేసే విషయంలో మంత్రులు, సొంత పార్టీ నాయకులను సైతం పక్కనపెట్టి పూర్తిగా అధికారులకు బాధ్యతలు అప్పగించి తప్పు చేశాననే అభిప్రాయం జగన్ లో ఇప్పుడు కనిపిస్తోంది.అయితే జగన్ ఎక్కువగా తన కార్యాలయానికి పరిమితమైపోవడం, క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయకపోవడం, తదితర కారణాలతో అధికారులు అలసత్వంగా వ్యవహరిస్తూ, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారని విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న జగన్ సదరు అధికారులు అందరికీ మెమోలు ఉన్నతాధికారుల చేత జారీ చేయించారు.

అయితే ఇదే విధంగా వరుసగా అధికారులకు మెమోలు జారీ చేస్తూ వెళ్తే, ఉద్యోగులను ప్రభుత్వం వేధిస్తోంది అనే సంకేతాలు వెళ్తాయని, మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఈ వ్యవహారాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందనే విషయాన్ని జగన్ కు కొంతమంది సన్నిహితులు చెప్పడంతో ఈ వ్యవహారాలపై ఏం చేయాలనే విషయం పై జగన్ ఆలోచనలో పడ్డారట .ఏది ఏమైనా గతంలో మాదిరిగా కాకుండా జగన్ ఇకపై చాలా జాగ్రత్తగానే అన్ని వ్యవహారాలను బ్యాలెన్స్ చేసుకోవాల్సిందే.

ఏపీలో పేదల పథకాలకు బాబే అడ్డు పడుతున్నారా.. ఆ ఫిర్యాదులే ప్రజల పాలిట శాపమా?
Advertisement

తాజా వార్తలు