దూసుకుపోతున్న టీఆర్ ఎస్‌, బీజేపీ.. ఇంకా క‌ద‌ల‌ని కాంగ్రెస్‌..!

తెలంగాణ రాజ‌కీయాల్లో అత్యంత కీల‌కంగా ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లు ఉన్నాయ‌నే చెప్పాలి.

కాగా ఇక్క‌డ ఎలాగైనా గెలిచి త‌న ప‌ట్టు నిలుపుకోవాల‌ని ఈట‌ల రాజేంద‌ర్ ఎంతో స్కెచ్ వేసి మ‌రీ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు.

కాగా అటు టీఆర్ ఎస్ కూడా ఎలాగైనా ఈట‌ల‌రాజేంద‌ర్ ఓడించాల‌ని లేకుంటే పార్టీ నుంచి చాలా మంది వెళ్లిపోయే ప్ర‌మాదం ఉంటుంద‌ని భావిస్తోంది.అంతే కాకుండా ఓడిపోతే రాష్ట్రంలో ప‌ట్టుకోల్పోతామ‌ని, బీజేపీ అన‌నూహ్యంంగా బ‌ల‌ప‌డిపోతుంద‌ని కేసీఆర్ ఆలోచిస్తున్నారు.

ఇందుకోస‌మే ఏకంగా గ‌తంలో ఎన్న‌డూ లేనంతగా ఒక్క ఉప ఎన్నిక కోస‌మే ద‌ళిత బంధు లాంటి స్కీమ్ పెట్టారు.అంతే కాకుండా ఇత‌ర ఆగిపోయిన ప‌థ‌కాల‌ను కూడా ఇక్క‌డి నుంచే ప్రారంభిస్తున్నారు.

అంటే ఎంత‌సీరియ‌స్‌గా తీసుకుంటాన్న‌రో అర్థం చేసుకోవ‌చ్చు.ఇక బీజేపీ కూడా ఈట‌ల‌ను క్యాండిడేట్‌గా ప్ర‌క‌టించి ప్ర‌తి మండ‌లానికి ఓ ఇన్ చార్జిని కూడా నియ‌మించిందంటే ఎంత సీరియ‌స్గా తీసుకుంటుందో అర్థ‌మ‌వుతోంది.

Advertisement

అయితే ఈ రెండు పార్టీలు ఇంకా నోటిఫికేష‌న్ కూడా రాక‌ముందే ఇంత‌లా ప్ర‌చారం చేస్తున్నాయి.

కానీ కాంగ్రెస్ మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌ట్లేదు.కొత్త‌గా టీపీసీసీ బాస్ అయిన రేవంత్ రెడ్డి జోరు చూపిస్తార‌నుకుంటే చ‌తికిల ప‌డిపోతున్నారు.ఆయ‌న ఎంత సేపూ టీఆర్ ఎస్‌, బీజేపీపై విమ‌ర్శ‌లు చేయ‌డానికి మాత్ర‌మే ప‌రిమిత‌మ‌వుతున్నారు.

ఇక అటు ధ‌ర్నాలు, రాస్తారోకోల‌తో హోరెత్తిస్తున్న రేవంత్‌.ఆయ‌న ప‌గ్గాలు తీసుకున్న త‌ర్వాత వస్తున్న తొలి ఎన్నిక‌ను అంత సీరియ‌స్‌గా తీసుకోవ‌ట్లేద‌ని తెలుస్తోంది.

ఇంకా అభ్య‌ర్థిని కూడా ప్ర‌క‌టించ‌లేదు.అభ్య‌ర్థిని ప్ర‌క‌టిస్తే క‌నీసం కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉంద‌నేది అంద‌ర‌కీ అర్థ‌మ‌వుతుంది.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

కానీ ఆయ‌న మాత్రం ఆ దిశ‌గా అడుగులు వేయ‌ట్లేదు.దీంతో ఆయ‌న వ్యూహం ఏంటో ఎవ‌రికీ అర్థంకాకుండా ఉంది.

Advertisement

చూడాలి మ‌రి ఏం చేస్తార‌నేది.

తాజా వార్తలు