సినీ నటిని పెళ్లి చేసుకోబోతున్న బిగ్ బాస్ కంటెస్టెంట్?

సినీ గీత రచయితగా, నటుడిగా, మక్కల్‌ నీది మయ్యం పార్టీ యువజన విభాగం కార్యదర్శి స్నేహన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

స్నేహన్ సుమారుగా 700 చిత్రాలకు పైగా 2,500 పైగా పాటలు రాసి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

ఈ క్రమంలోనే బుల్లితెరపై ఎంతో విజయవంతంగా దూసుకుపోతున్న బిగ్ బాస్ తమిళ సీజన్ 1 లో పాల్గొని తనదైన శైలిలో ఆడుతూ రన్నర్ గా నిలిచారు.ఈ విధంగా బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత స్నేహన్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది.

ఈ క్రమంలోనే మక్కల్‌ నీది మయ్యం పార్టీ యువజన విభాగం కార్యదర్శిగా బాధ్యతలు చేపడుతున్నారు.ఇలా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు.

స్నేహన్ ,నటి కన్నిక రవిని పెద్దల అంగీకారంతో, ఈనెల 29వ తేదీన తమిళ నటుడు కమల్ హాసన్ సమక్షంలో చెన్నైలో వివాహం చేసుకోబోతున్నారు.ప్రస్తుతం కరోనా పరిస్థితుల కారణంగా తన పెళ్లిని నిరాడంబరంగా జరుపుకోవాలని భావించినట్లు స్నేహన్ ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ విధంగా స్నేహన్ తన పెళ్లి విషయం వెల్లడించడంతో అభిమానులు పెద్ద ఎత్తున తనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Advertisement
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

తాజా వార్తలు