ర‌మ‌ణ‌కు కేటీఆర్‌, కౌశిక్ రెడ్డికి కేసీఆర్‌.. కౌశిక్‌కు అంత ప్రాముఖ్యత ఇవ్వ‌డ‌మెందుకు..?

రాజ‌కీయాల్లో కేసీఆర్ కు ఉన్నంత ముందు చూపు ఇంకెవ‌రికీ ఉండ‌దేమో అని చెప్పాలి.ఎందుకంటే ఆయ‌న ఏది చేసినా దాని ఇంపాక్ట్ భ‌విష్య‌త్‌లో క‌చ్చితంగా ఉంటుంది.

ఇక ఇప్పుడు కూడా ఆయ‌న ఎంతో ప్లాన్ ప్ర‌కారం హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో చ‌క్రం తిప్పుతున్నారు.ఇందులో భాగంగా మొద‌టి నుంచి అక్క‌డ కాంగ్రెస్ అభ్య‌ర్థిగా అంద‌రూ ఊహిస్తున్న కౌశిక్ రెడ్డిని ప్లాన్ ప్ర‌కారం టీఆర్ ఎస్‌లోకి తీసుకొచ్చే విధంగా స‌క్సెస్ అయ్యారు.

అయితే ఇక్క‌డే ఆయ‌న వ్యూహం ఎవ‌రికీ అర్థం కావ‌ట్లేదు.ఎందుకంటే కౌశిక్‌రెడ్డి కంటే ముందే ఎల్‌.

రమ‌ణ కూడా పార్టీలో చేరారు.ఆయ‌న ఇప్ప‌డు టీటీడీపీ అధ్య‌క్షుడిగా ఉన్నారు.

Advertisement

నిజానికి ఎల్‌.ర‌మ‌ణ కంటే పెద్ద లీడర్ కాదు కౌశిక్ రెడ్డి.

మ‌రి కౌశిక్ రెడ్డి చేరిన‌ప్పుడు ఏకంగా సీఎం కేసీఆర్ వ‌చ్చారు.కానీ ఒక పార్టీకి అధ్య‌క్షుడిగా ఉన్న ఎల్‌.

ర‌మ‌ణ చేరిన‌ప‌పుడు మాత్రం కేటీఆర్ వ‌చ్చి కండువా క‌ప్పారు.దీంతో అస‌లు కౌశిక్ రెడ్డికి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్న‌ట్టు అని ప్ర‌శ్నిస్తున్నారు.

ఎందుకంటే క‌నీసం కౌశిక్ కు ఇప్పుడు ప‌ద‌వి కూడా లేదు.కానీ హుజూరాబాద్‌లో అభ్య‌ర్థిగా ఎవ‌రిని నిల‌బెట్టినా కౌశిక్ కంటే ఎఫెక్ట్ చూపించ‌లేరని కేసీఆర్ భావిస్తున్నారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఒక‌వేళ కౌశిక్‌ను కాద‌ని వేరే వ్య‌క్తిని నిలెబ్టినా కూడా కౌశిక్ స‌పోర్టు ఉంటే ఎక్కువ ఓట్లు ప‌డ‌తాయి.అలాగే కాంగ్రెస్ కు ఓట్లు ప‌డ‌కుండా అవ‌న్నీ టీఆర్ ఎస్ ఖాతాలోప‌డుతాయ‌ని కేసీఆర్ ఆలోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది.ఇప్పుడు ఎంతో ఉద్రిక్తంగా సాగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక టీఆర్ ఎస్ ప‌రువుకు సంబంధించిగా అంతా భావిస్తున్నారు.

Advertisement

మ‌రి అంతలా పంతం నిల‌బెట్టుకోవాలంటే ఈ మాత్రం ఇంపార్టెన్స్ కౌశిక్ కు ఇవ్వాల్సిందే అంటూ అంతా భావిస్తున్నారు.ఏదేమైనా కౌశిక్ ను కేసీఆర్ స్వ‌యంగా ఒప్పించి మ‌రీ పార్టీలో చేర్చుకోవ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

తాజా వార్తలు