కార్తీకదీపం ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. నెట్ ఫ్లిక్స్ లో వంటలక్క..?

బుల్లితెర సీరియళ్లలో కార్తీకదీపం సీరియల్ మంచి రేటింగ్స్ తో నంబర్ 1 స్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

అయితే గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో ఈ సీరియల్ కు రేటింగ్స్ తగ్గుతున్నాయి.

మంచి రేటింగ్స్ వస్తున్న సమయంలోనే ఈ సీరియల్ ను ఆపేస్తే బెటర్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.అయితే త్వరలో ఈ సీరియల్ కు శుభం కార్డు పడనుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.

అయితే ఈ సీరియల్ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో సినిమాలా రానుందని ఒక వార్త వినిపిస్తోంది.అయితే వైరల్ అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

కార్తీకదీపం సీరియల్ పూర్తి కావడం వలెలి ప్రేమీ విశ్వనాథ్ మలయాళంలో ఒక సీరియల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.సోమవారం నుంచి శనివారం వరకు స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ఆగిపోతే ఆ వార్త కార్తీకదీపం ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.

Advertisement

నెట్ ఫ్లిక్స్ లో ఈ షో ప్రసారమైతే మాత్రం నెట్ ఫ్లిక్స్ లో కూడా ఈ సీరియల్ రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించే అవకాశం ఉంటుంది.

1000కు పైగా ఎపిసోడ్లు ప్రసారమవుతున్న అతి కొద్ది సీరియల్స్ లో కార్తీకదీపం సీరియల్ ఒకటని చెప్పవచ్చు.కార్తీకదీపంలో డాక్టర్ బాబుగా నటిస్తున్న నిరుపమ్ కూడా కొత్త సీరియల్స్ కు కమిటవుతున్నారు.వంటలక్క తెలుగు సీరియల్స్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తే బాగుంటుందని ఆమె ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

మరి మలయాళ సీరియల్ తో బిజీ అవుతున్న వంటలక్క భవిష్యత్తులో తెలుగు సీరియళ్లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తారేమో చూడాల్సి ఉంది.మరోవైపు వంటలక్క సినిమాలలో కూడా నటిస్తుండగా ఆమె నటిస్తున్న సినిమా ఎప్పుడు రిలీజవుతుందో చూడాల్సి ఉంది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు